‘కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్’ కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లు
ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST
గత ఆర్థిక సంవత్సరానికి కెనరా హెచ్ఎ్సబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లకు పెరిగింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరానికి కెనరా హెచ్ఎ్సబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత కొత్త ప్రీమియం ఆదాయం రూ.975 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే కాలం కొత్త ప్రీమియం ఆదాయం రూ.915 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందిందని కంపెనీ ఎండీ, సీఈఓ అనుజ్ మాధుర్ తెలిపారు. 2019-20కి స్థూల ప్రీమియం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.3,943 కోట్లకు చేరింది. వ్యక్తిగత క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 98.1 శాతం ఉంది.