‘పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2021-04-23T05:21:59+05:30 IST

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ముద్దం నాగనవీన్‌ డిమాండ్‌ చేశారు.

‘పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి’

నంద్యాల, ఏప్రిల్‌ 22: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ నంద్యాల పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ముద్దం నాగనవీన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం నవీన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుంటే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని అన్నారు. ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, విద్యార్థుల తల్లిదండ్రులతో జూమ్‌  కాల్‌ సమావేశంలో కరోనా తీవ్రతపై ప్రశ్నించారని అన్నారు. పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  


నంద్యాల(ఎడ్యుకేషన్‌): రాష్ట్రంలో కరోనా పాజిటీవ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను రద్దు చేయాలని నేషనల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు డి.చిన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కరోనా సోకితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో విజయ్‌, వంశీ, జనార్థన్‌, రాఘవ, సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:21:59+05:30 IST