పరీక్షలు తక్షణమే రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-06-24T09:13:58+05:30 IST

ఇంటర్మీడియెట్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం పంతానికి పోతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ ఎంపీ రఘురామరాజు హెచ్చరించారు

పరీక్షలు తక్షణమే రద్దు చేయండి

విద్యార్థులు, తల్లిదండ్రులు తిరగబడితే మళ్లీ అధికారం కల్లే

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ


న్యూఢిల్లీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం పంతానికి పోతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ ఎంపీ రఘురామరాజు హెచ్చరించారు. ఇంటర్‌ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే, ప్రభుత్వ మొండి వైఖరిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈమేరకు ఎంపీ రఘురామ బుధవారం ‘నవ ప్రభుత్వ కర్తవ్యాలు’ పేరుతో ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.  విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వైరం పెట్టుకోవద్దని సూచించారు. కొవిడ్‌ నుంచి పిల్లలను కాపాడేందుకు వివిధ రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో చర్చించిన తర్వాతే ప్రధాని నరేంద్రమోదీ 12వ తరగతి సీబీఎ్‌సఈ బోర్డు పరీక్షలను రద్దు చేశారని తెలిపారు. ఈ నిర్ణయం తర్వాత సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈలతోపాటు 20 రాష్ర్టాలలో పరీక్షలు రద్దు చేశారని గుర్తు చేశారు. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రమే పరీక్షల నిర్వహణకు మొండిగా వ్యవహరిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-24T09:13:58+05:30 IST