సంఘాలకు పాఠశాలల ప్రవేశ అనుమతుల రద్దు సరికాదు

ABN , First Publish Date - 2022-08-18T06:19:57+05:30 IST

విద్యార్థి, ప్రజా సంఘాలు, పాత్రికేయులు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోకి ప్రవేశ అనుమతులు లేకుండా పాడేరు ఐటీడీఏ సర్క్యులర్‌ జారీ చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ అన్నారు.

సంఘాలకు పాఠశాలల ప్రవేశ అనుమతుల రద్దు సరికాదు
సర్క్యులర్‌ ప్రతులను తగులబెడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ 

సర్క్యులర్‌ ప్రతుల దహనం


ముంచంగిపుట్టు, ఆగస్టు 17: విద్యార్థి, ప్రజా సంఘాలు, పాత్రికేయులు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోకి ప్రవేశ అనుమతులు లేకుండా  పాడేరు ఐటీడీఏ సర్క్యులర్‌ జారీ చేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం పీవో జారీ చేసిన నూతన సర్క్యులర్‌ పత్రాలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తగల బెట్టారు. అనంతరం స్థానిక కళాశాల విద్యార్థులతో ఆయన సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుదాస్‌ మాట్లాడుతూ కళాశాలలో, పాఠశాలలు, వసతి గృహాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించని పీవో, వింత సర్క్యులర్లను జారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమస్యలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయులు పాఠశాలు, వసతి గృహాల్లోకి ప్రవేశించకుండా సర్క్యులర్‌ జారీ చేశారని ఆయన ద్వజమెత్తారు. పీవో అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T06:19:57+05:30 IST