టీడీపీ పథకాల రద్దు సరికాదు

ABN , First Publish Date - 2022-06-25T06:01:26+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి రద్దు చేయడం పట్ల అంబేడ్కర్‌ పూలే రైట్స్‌ ఫోరం వ్యవస్థాపకుడు, జడ్జి రామకృష్ణ మండిప డ్డారు.

టీడీపీ పథకాల రద్దు సరికాదు
మాట్లాడుతున్న అంబేడ్కర్‌, ఫూలే రైట్స్‌ ఫోరం వ్యవస్థాపకుడు, జడ్జి రామకృష్ణ


సీఎం జగనపై మండిపడ్డ అంబేడ్కర్‌ ఫూలే రైట్స్‌ ఫోరం వ్యవస్థాపకుడు, జడ్జి రామకృష్ణ

ధర్మవరం, జూన 24: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి రద్దు చేయడం పట్ల అంబేడ్కర్‌ పూలే రైట్స్‌ ఫోరం వ్యవస్థాపకుడు, జడ్జి రామకృష్ణ మండిప డ్డారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బలో శుక్రవారం ఫోరం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన, దుల్హన తదితర పథకాలతో పేదలకు మేలు జరిగేదని అన్నారు. వాటన్నింటినీ వైసీపీ అధికారంలోకి రాగానే ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 90 శాతం ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల వారిని అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వారిని బానిసలుగా మార్చుకుని, పొట్టకొడుతున్నారని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి వారు ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పరిస్థితి దుర్భరంగా ఉండేదని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ రెండు గ్లాసుల పద్ధతి అమలవుతోందన్నారు. అంటరానితనం రాజ్యమేలుతోందని విమర్శించారు. వ్యవసాయ బోర్లకు  విద్యుత మీటర్లను బిగించే పద్ధతిని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రవేశపెడితే, ఒక్క ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నారని సీఎం జగనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-06-25T06:01:26+05:30 IST