క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం బాలిక ‘కళాకృషి’

Sep 22 2021 @ 11:21AM

చెన్నై: స్థానిక అడయార్‌లోని క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆదుకునేందుకు డిజిటల్‌ ఆర్ట్‌ వర్క్‌షా్‌పను నిర్వహిస్తూ నిధులను సేకరిస్తోంది ఓ పద్నాలుగేళ్ల బాలిక. తన మనసులో మెదిలే భావాలను డిజిటల్‌గా సజీవంగా మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తోంది. ఆమె పేరు ఈషా. స్థానిక చర్చ్‌పార్క్‌లో వున్న శాక్రెడ్‌ హార్డ్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూలులో పదవ తరగతి చదువుతున్న ఆ బాలిక.. పెన్సిల్‌ పట్టుకున్నప్పటి నుంచే కుంచెకు పని చెప్పింది. కాలక్రమేణా ఆమె మంచి ఆర్టిస్టుగా ఎదిగింది. ఈషా డిజిటల్‌ ఆర్ట్‌పై వర్క్‌షా్‌పలను నిర్వహిస్తోంది. యూట్యూబ్‌లో కూడా వీక్లీ లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తుంది. మంచివక్త అయిన ఆ బాలిక యువతలో స్ఫూర్తిని నింపేందుకు ఈ వయసు నుంచే తన వంతు కృషి చేస్తుండడం విశేషం. మహమ్మారితో నెలకొన్న సంక్షోభ కాలంలో అడయార్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, గురుప్రియ విజన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ సంస్థల కోసం డబ్బు సేకరించేందుకు ఐదు రోజుల డిజిటల్‌ ఆర్ట్‌ వర్క్‌షాపును నిర్వహించింది. తన వర్క్‌షాపుతో రూ.25 వేలు సంపాదించిన ఈషా.. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాస్‌ సెంట్రల్‌’ వారి సాయంతో క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు మాస్కులు, శానిటైర్లను కూడా సేకరించగలిగింది.‘క్యాన్సర్‌ చిన్నారుల కోసం మరెంతో చేయాలని వుంది. ఆ మేరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది ఈషా. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.