నిజామాబాద్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

ABN , First Publish Date - 2022-03-09T00:35:27+05:30 IST

నిజామాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అంకాలజిస్ట్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రారంభించారు.

నిజామాబాద్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

నిజామాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలోని ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అంకాలజిస్ట్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ప్రారంభించారు. మహిళా దినోత్సవాన మహిళా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రారంభించుకోవడంపై దత్తాత్రేయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా మంతెన వెంకట రామరాజు, సిఎమ్‌డి, వసుధ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్, ఫౌండర్ ఛైర్మన్, వసుధ ఫౌండేషన్; గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు & సీఈఓ డాక్టర్ చినబాబు సుంకవల్లి; డాక్టర్ హేమంత్ వుదయరాజు, కిరణ్ వక్కలంక; డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రికి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధునాతన అంబులెన్స్, వెంటిలేటర్ మరియు సర్జికల్ మాస్క్‌లను విరాళంగా అందించింది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, దానిని ప్రారంభంలోనే గుర్తించడం, క్యాన్సర్ వ్యాధికి తగిన చికిత్స, వ్యాధి తగ్గిన తరువాత వారికి పునరావాసం మరియు అవసరమైన వారికి పరిశోధనల ద్వారా క్యాన్సర్ భారాన్ని తగ్గించే దృష్టితో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించబడిందని డాక్టర్ చినబాబు తెలిపారు. 

Updated Date - 2022-03-09T00:35:27+05:30 IST