కనిపించని కోలాహలం!

ABN , First Publish Date - 2020-10-02T06:22:27+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రక టించినా.. ఉభయ జిల్లాల్లో ఎన్నిక సందడి మాత్రం

కనిపించని కోలాహలం!

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రచారానికి దూరంగా అభ్యర్థులు

అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా మంత్రి ఆధ్వర్యంలో సమావేశాలు

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మంతనాలు 

దృష్టి పెట్టని ప్రతిపక్ష నేతలు

కనీసం పార్టీ ప్రజాప్రతినిధులను సైతం కలవని నాయకులు


నిజామాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రక టించినా.. ఉభయ జిల్లాల్లో ఎన్నిక సందడి మాత్రం కనిపించడం లేదు. ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న అభ్యర్థు లు ప్రచారం చేయడం లేదు. పార్టీల నేతల ఎత్తులు.. పై ఎత్తులు లేవు. ఎన్నికలో భాగంగా ఓటర్లను కలిసే ప్రయత్నం లేదు. పోటీలో ఉన్న ప్రతిపక్ష పార్టీల అభ్య ర్థులు ప్రచారానికి దూరంగా ఉండగా.. అధికార పార్టీ అభ్యర్థి తరఫున ఉమ్మడి జిల్లా నేతలు మండలాల వారీగా ఉన్న ఓటర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలలో భాగంగా ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతి నిధులను చేర్చుకుంటూ తమ అభ్యర్థికి ఎదురు లేకుం డా అధిక ఓట్లను సాధించే ప్రయత్నం చేస్తున్నారు.


నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కోసం గత మార్చి నెలలో షెడ్యూల్‌ ప్రకటించారు. నోటిఫికేష న్‌ ఇచ్చి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్‌ వేసి న వారిలో నలుగురు విత్‌ డ్రా చేసుకోగా పోటీలో ము గ్గురు మిగిలారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ తరఫున సు భాష్‌రెడ్డి, బీజేపీ తరఫున పోతంకార్‌ లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. వీరు ప్రచారం చేసుకునే సమయం లో కరోనా తీవ్రం కావడంతో ఎన్నికల కమిషన్‌ ఎన్నిక ను వాయిదా వేసింది. ఏప్రిల్‌ 7న జరగాల్సిన పోలింగ్‌ వాయిదా పడింది. ఆరు నెలల పాటు కరోనా తగ్గకపో వడంతో బీహార్‌ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 9న పోలింగ్‌, 12న కౌంటింగ్‌ జరుపుతామని షెడ్యూల్‌లో ప్రకటించింది. ఈ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.


ఉమ్మడి జిల్లాలో కనిపించని సందడి

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా ప రిధిలో ఎన్నిక కోలాహలం లేదు. ప్రచార ఆర్భాటం లే దు. అభ్యర్థులెవరూ ఉమ్మడి జిల్లా పరిధిలో తిరగడం లేదు. ఓటర్లను కలవడం లేదు. ఉమ్మడి జిల్లా ప్రజ ల్లోనూ చర్చ జరగడం లేదు. స్థానిక సంస్థల సభ్యులే ఓటర్లుగా ఉండడంతో ఎవరూ ప్రచారానికి రావడం లే దు. మొత్తం ఓటర్లలో అధికార పార్టీకి మూడు వంతు ల మంది ఉండడంతో పోటీలో ఉన్న ప్రతిపక్ష అభ్యర్థు లు కూడా ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు. కనీసం వారి పార్టీ వారిని కలవడం లేదు. స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ కావడంతో తిరిగినా ఫలితం లేదని ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారం చేయడం లేదు. ఆ పార్టీల రాష్ట్ర నేతలు కూడా ఈ ఎన్నికపై ఎక్కడా మాట్లాడడం లే దు. కనీసం తమ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీ విడిచి వెళ్లినా పట్టించుకోవ డం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతిపక్ష పార్టీలకు తక్కువ మందే స్థానిక సంస్థల సభ్యులు ఉన్నా వారిని వెళ్లకుండా ఆపడం లేదు. తమకు గెలిచే అవకాశం లేకపోవడంతో ఇరుపార్టీల నేతలు వదిలివేశారు. ఉ మ్మడి జిల్లా నేతలు కూడా క్యాడర్‌లో ఉప ఎన్నిక సం దర్భంగా మనోధైర్యం నింపేందుకు ప్రచారం చేయడం లేదు.


అధికార పార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ నేతలు ముమ్మర ప్ర యత్నాలు చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అ భ్యర్థి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రెండు ధఫాలు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్‌, వి ప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవ న్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, షకీల్‌ అమీర్‌, హన్మంత్‌ షిండే, నల్లమడుగు సురేందర్‌, ఎమ్మేల్సీలు రాజేశ్వర్‌రా వు, వీజీ గౌడ్‌, ఆకుల లలిత, జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు. డీసీసీబీ చైర్మన్‌ బాస్కర్‌రెడ్డితో పాటు జి ల్లా ఇన్‌చార్జి తుల ఉమ ఇతర నేతలు ఈ సమావేశా నికి హాజరయ్యారు. తమ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ తగ్గకుండా చూడాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటున్నారు.


మండలాల వారీగా ఓటర్లు ఉండడం వల్ల ఎమ్మెల్యేలు వా రితో చర్చలు జరుపుతూ పార్టీ ఓట్లు చీలకుండా చూ స్తున్నారు. ఇతర పార్టీల ఓటర్ల మద్దతు కూడగడుతు న్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే పనిచేస్తున్నారు. తమ నియోజక వర్గం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యేలు ప్ర యత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థికి సమ స్య రాకుండా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయ మైనా.. ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. త మ పరిధిలో నిరంతరం సమన్వయం చేస్తూ పనిచేస్తు న్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏ ఎన్నికయినా ప్రచా రంతో ఊదరగొట్టే అభ్యర్థులు కరోనా పుణ్యమా అని ఎ లాంటి ఖర్చు లేకుండానే పని కానిస్తున్నారని ఆయా పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా కొన్ని రోజులు ప్రచారం చేయవచ్చని భా వించిన ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం నిరాశే మిగిలింది.    

Updated Date - 2020-10-02T06:22:27+05:30 IST