ఈనెల 28న అభ్యర్థుల వ్యయాల తనిఖీ

ABN , First Publish Date - 2021-04-24T05:14:03+05:30 IST

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సిద్దిపేట మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించిన అకౌంట్‌ బుక్‌లను ఈనెల 28న తనిఖీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌, సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు.

ఈనెల 28న అభ్యర్థుల వ్యయాల తనిఖీ

సిద్దిపేట సిటీ, ఏప్రిల్‌ 23: రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సిద్దిపేట మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించిన అకౌంట్‌ బుక్‌లను ఈనెల 28న తనిఖీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌, సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ ముజామిల్‌ఖాన్‌ తెలిపారు. సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో 28న ప్రచార వ్యయ అకౌంట్‌ బుక్‌ల తనిఖీ ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ ప్రచార వ్యయాలకు సంబంధించిన అకౌంటు బుక్‌లను సంబంధిత వార్డు రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలన్నారు. అభ్యర్థులు లేదా అభ్యర్థుల ఏజెంట్లు అకౌంట్‌ బుక్‌ల తనిఖీకి తప్పకుండా హాజరుకావాలని సూచించారు.


 

Updated Date - 2021-04-24T05:14:03+05:30 IST