పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ వీరంగం

ABN , First Publish Date - 2022-06-16T14:06:41+05:30 IST

పాతబస్తీలోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ వీరంగం సృష్టించింది.

పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ వీరంగం

హైదరాబాద్‌: పాతబస్తీలోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. షరీఫ్‌ అనే వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. గొడవపడొద్దన్నందుకు షరీఫ్‌పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాలతో ఉన్న షరీఫ్‌ని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గంజాయి బ్యాచ్‌ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-06-16T14:06:41+05:30 IST