గంజాయి ముఠా అరెస్ట్

Published: Fri, 17 Dec 2021 16:51:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గంజాయి ముఠా అరెస్ట్

రాచకొండ: తమకు అందిన ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు నగరంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం 5 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఒరిస్సా, ఆంద్రప్రదేశ్ లోని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 240 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.


మొత్తం ఈ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ముఠాలోని కీలక నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. కేరళకు చెందిన శివన్ కృష్ణన్ ప్రధాన నిందితుడని ఆయన పేర్కొన్నారు. ముఠా సభ్యుల నుంచి ఒక లారీ, 8 లక్షల నగదు, 2 కార్లు ,19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుకున్న సొత్తు విలువ 90 లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని ముంబైలో 15 వేలకు అమ్ముతున్నారని ఆయన తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.