Delhiలో వేడి గాలులతో కొన్ని సెకన్లు కూడా రోడ్డుపై నడవలేక పోయా...climate activist లిసిప్రియ ట్వీట్

ABN , First Publish Date - 2022-05-16T14:57:47+05:30 IST

ఆదివారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీని మండుటెండలు అట్టుడికించాయి....

Delhiలో వేడి గాలులతో కొన్ని సెకన్లు కూడా రోడ్డుపై నడవలేక పోయా...climate activist లిసిప్రియ ట్వీట్

న్యూఢిల్లీ: ఆదివారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీని మండుటెండలు అట్టుడికించాయి. ఆదివారం ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 49.2 డిగ్రీల సెల్సియస్(120.5 ఫారెన్ హీట్) నమోదైంది.ఢిల్లీని అల్లాడించిన మండుటెండలపై ఎన్విరాన్‌మెంటల్, క్రైమెట్ యాక్టివిస్టు, ఛైల్డ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకురాలు, పదేళ్ల లిసిప్రియ కంగుజమ్ స్పందించి ట్వీట్ చేశారు.‘‘ఢిల్లీలో ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది...విపరీతమైన వేడి కారణంగా నేను కొన్ని సెకన్లపాటు కూడా రోడ్డుపై నడవలేక పోయాను, గాలి కంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది, నేను గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ మండుటెండలు పిల్లలకు చాలా ప్రమాదకరం’’ అని లిసిప్రియ ట్వీట్ చేశారు. 


Updated Date - 2022-05-16T14:57:47+05:30 IST