అప్పు చేయలేం.. మధ్యాహ్న భోజనం పెట్టలేం!

ABN , First Publish Date - 2021-11-27T05:01:53+05:30 IST

గత నాలుగు నెలలుగా మండలంలో మధ్యాహ్న భోజన కుకింగ్‌ ఏజెన్సీలకు గౌరవ వేతనం అందటం లేదు.

అప్పు చేయలేం.. మధ్యాహ్న భోజనం పెట్టలేం!
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

మూడు నెలలుగా అందని బిల్లులు 

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

4 నెలలుగా అందని గౌరవ వేతనం

ఆందోళన బాటలో వంట ఏజెన్సీలు 

త్రిపురాంతకం, నవంబరు 26: గత నాలుగు నెలలుగా మండలంలో మధ్యాహ్న భోజన కుకింగ్‌ ఏజెన్సీలకు గౌరవ వేతనం అందటం లేదు. మూడు నెలలు గా బిల్లులు చెల్లించడంలేదు. దీంతో నిత్యావసరాల కొ నుగోలు చేయటానికి లక్షల్లో అప్పులు చేసి మధ్యా హ్న భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకొందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతోపాటు వారి ఉత్తీర్ణత శాతం పెంచటానికి ప్రవేశ పె ట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అస్తవ్యస్తం గా మారింది. గత విద్యా సంవత్సరం వరకు మాత్రమే మధ్యాహ్న భోజన బిల్లులు అందాయి. ఈ ఏడాది ఆగస్టు సగం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తుండడంతో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నె లల బిల్లులు అందకపోయినా ఏజెన్సీ నిర్వాహకులు కి రాణ దుకాణాలలో సరుకులు అప్పులుచేసి విద్యార్థుల కు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. మరో రెండు రోజుల్లో నవంబరు మాసం ముగుస్తున్నా ఇంతవరకు బిల్లులు రాలేదు.

ఏజెన్సీలపై నిర్వహణ భారం 

మండలంలోని 48 ప్రాథమిక, 6 ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారుగా 5,500 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరువుతుంటారు. వీరందరికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వడ్డించటానికి కుకింగ్‌ ఏజెన్సీలు, హెల్పర్లు మొత్తం 114 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు. ఈఏడాది ఏప్రిల్‌ వరకు మధ్యాహ్న భోజన బిల్లు లు చెల్లించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలకు భోజనం బిల్లులు అందలేదు. జూలై నుంచి ఇప్ప టి వరకు నాలుగునెలల గౌరవ  వేతనం రావాల్సి ఉం ది. గౌరవ వేతనంతో పాటు భోజనం బిల్లులు సుమారు రూ.18 లక్షలు రాకపోవడంతో కుకింగ్‌  ఏజెన్సీలు అప్పులు చేసి  భోజనం అందజేస్తున్నారు. చేతిలో నగ దు లేక చేసిన అప్పుల చెల్లింపులో జాప్యం చోటు చేసుకోవటంతో కొన్ని పాఠశాలల్లో కుకింగ్‌ ఏజెన్సీలు  బంగారం, ఇతర వస్తువులను కుదువపెట్టి పని జరుపుతున్నట్లు సమాచారం.

 అప్పునకు సరుకులు ఇవ్వటం లేదు 

- బొందలపాటి నాసరమ్మ, కుకింగ్‌ ఏజెన్సీ నిర్వాహకురాలు

మూడు నెలలుగా బిల్లులు రాలేదు. సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. కిరాణ దుకాణాల వారు ఇప్పటివరకు ఇచ్చిన స రుకులకు డబ్బులు అడుగుతున్నారు. ఇక అప్పులు ఇవ్వమంటున్నారు. మాకుటుంబ సభ్యులు కూలీ పని చేయగా వచ్చిన డబ్బులను దుకాణాల్లో చెల్లించాల్సి వస్తుంది. 

Updated Date - 2021-11-27T05:01:53+05:30 IST