‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోలేం!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

ABN , First Publish Date - 2021-01-17T08:10:26+05:30 IST

కరోనా వైరస్‌ సోకిన మొదటివ్యక్తి ‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో)

‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోలేం!: ప్రపంచ ఆరోగ్య సంస్థ

బీజింగ్‌/జెనీవా, జనవరి 16: కరోనా వైరస్‌ సోకిన మొదటివ్యక్తి ‘పేషెంట్‌ జీరో’ను కనుక్కోవడం అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చిచెప్పింది. కరోనా వైరస్‌ మూలాల కనుగొనేందుకు డబ్ల్యూహెచ్‌వోకి చెందిన నిపుణుల బృందం చైనాలోని వుహాన్‌లో  పర్యటిస్తోంది.


ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో వ్యాధుల విభా గం సాంకేతిశాఖ అధిపతి మారియా వ్యాన్‌ కోర్కోవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైర్‌ససోకిన తొలిపేషెంట్‌ ఆచూకీని తెలుసుకోవడం సాధ్యంకాదని స్పష్టంచేశారు. కాగా, ప్రపంచాన్ని అతలాకుతలంచేసిన కోరానా వైరస్‌  ఆనవాళ్లు చైనాలోని వుహాన్‌లో  2019 డిసెంబరులో తొలిసారిగా గుర్తించిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-01-17T08:10:26+05:30 IST