అక్రమ కేసులతో అణచివేయలేరు: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-01T05:25:12+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు బనాయించి అణచి వేయాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫలించవని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామకుప్పం జడ్పీ టీసీ మాజీ సభ్యుడు మునస్వామి స్పష్టం చేశారు.

అక్రమ కేసులతో అణచివేయలేరు: టీడీపీ
శాంతిపురంలో ఆర్‌ఎస్‌మణితో గౌనివారి తదితరులు

 రామకుప్పం, సెప్టెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు బనాయించి అణచి వేయాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫలించవని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రామకుప్పం జడ్పీ టీసీ మాజీ సభ్యుడు  మునస్వామి స్పష్టం చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆయన్ను శుక్రవారం రామకుప్పం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు  ఘనంగా సన్మానించాయి. ప్రభుత్వం అనుపరిస్తున్న అస్తవ్యస్త విధానాలపై  ప్రజల పక్షాన పోరాడే విప క్ష నేతలు సంధించే విమర్శలను పాలకుల స్వీక రించి తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలే తప్ప అణచివేత ధోరణి అవలంబించరాదని మున స్వామి అన్నారు.  జైలులో  ఉన్న తనను పరామ ర్శించి భరోసా ఇచ్చిన పార్టీ అధినేతలు చంద్రబాబు, లోకేశ్‌ తదితరులకు  కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆనందరెడ్డి, నరసిం హులు, ఆంజనేయరెడ్డి,  పట్రనారాయణాచారి, రా మ్మూర్తి, గంట్లప్పగౌడు, జయశంకర్‌, కృష్ణానాయక్‌, నాగభూషణం, మహ్మద్‌రఫీ, వెంకటాచలం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



 శాంతిపురం: వైసీపీ ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నెల రోజులుగా చిత్తూరు జైలులో ఉన్న టీడీపీ శాంతిపురం మండల మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌.మణి శుక్రవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పార్టీ కుప్పం ఇన్‌చార్జి మునిరత్నం, మండల అధ్యక్షడు విశ్వనాథరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఉదయ్‌కుమార్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ నాగరాజు తదితరులు గజమాలలతో స్వాగతం పలికారు. శాంతిపురానికి చేరుకున్న మణీకి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మణీతో పాటూ నేతలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. తమపై ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వారు భవిష్యత్‌లో తప్పక జైలు జీవితం అనుభవిస్తారని  గౌనివారి అన్నారు. వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు రాబోయే కాలంలో బాధపడక తప్పదన్నారు. ఇక కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని గుర్తుచేసి, రాబోవు ఎన్నికల్లో ఆయన అత్యధికమెజారీటీతో గెలిచేలా కృషి చేయాలన్నారు. 


Updated Date - 2022-10-01T05:25:12+05:30 IST