కన్నతల్లిని కడసారి చూసుకోలేక..

ABN , First Publish Date - 2021-05-10T04:43:59+05:30 IST

‘కరోనా రక్కసి.. కన్నతల్లిని కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చేసింది. తనతో పాటు భార్య కొవిడ్‌ బారిన పడింది. దంపతులిద్దరూ విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్ద వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ వస్తున్నారు. ఇంతలో వృద్ధురాలైన తల్లి కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఎవరూ లేని దుస్థితి. చివరికి పారిశుధ్య కార్మికులే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇన్నాళ్లూ తనను కంటికిరెప్పలా కనిపెంచిన తల్లి రుణాన్ని తీర్చుకోలేకపోయానంటూ.. ఆస్పత్రిలో ఆ కుమారుడి పడుతున్న బాధ వర్ణణాతీతం. మాతృదినోత్సవం నాడు కాశీబుగ్గలో వెలుగుచూసిన ఘటన అందర్నీ కలచివేసింది.

కన్నతల్లిని కడసారి చూసుకోలేక..
మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న పారిశుధ్య సిబ్బంది

- కాశీబుగ్గలో కొవిడ్‌తో వృద్ధురాలి మృతి

- విశాఖలోని ఆస్పత్రిలో కుమారుడు, కోడలు

- పారిశుధ్య సిబ్బంది సహకారంతోనే అంత్యక్రియలు

- మాతృదినోత్సవం నాడు విషాదం

పలాస, మే 9: ‘కరోనా రక్కసి.. కన్నతల్లిని కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చేసింది. తనతో పాటు భార్య కొవిడ్‌ బారిన పడింది. దంపతులిద్దరూ విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్ద వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ వస్తున్నారు. ఇంతలో వృద్ధురాలైన తల్లి కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. అంతిమ సంస్కారాలు జరిపేందుకు ఎవరూ లేని దుస్థితి. చివరికి పారిశుధ్య కార్మికులే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇన్నాళ్లూ తనను కంటికిరెప్పలా కనిపెంచిన తల్లి రుణాన్ని తీర్చుకోలేకపోయానంటూ..  ఆస్పత్రిలో ఆ కుమారుడి పడుతున్న బాధ వర్ణణాతీతం. మాతృదినోత్సవం నాడు కాశీబుగ్గలో వెలుగుచూసిన ఘటన అందర్నీ కలచివేసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గలోని ఓ వీధిలో ఉపాధ్యాయుడు కుటుంబంతో నివాసముంటున్నాడు. కొద్దిరోజుల కిందట ఆయనతో పాటు భార్యకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విశాఖలోని ఓ ఆస్పత్రిలో వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్ద వృద్ధురాలైన తల్లి, తమ ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఇంతలో రెండు రోజుల కిందట వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. శనివారం రాత్రి ఆమె మృతి చెందారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండడంతో అంత్యక్రియలు కూడా పూర్తిచేయలేని దుస్థితి. విషయం తెలుసుకుని మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. మాతృదినోత్సవం నాడు ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు మరింత విషాదంలో మునిగిపోయారు. అధికారులతో పాటు పారిశుధ్య కార్మికులకు ఆ ఉపాధ్యాయుడు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-05-10T04:43:59+05:30 IST