జిల్లా కేంద్రానికి కూడా నీరు అందించలేరా

ABN , First Publish Date - 2022-07-07T04:50:49+05:30 IST

జిల్లా కేంద్రానికి కూడా తాగునీరు అందించడంలో అధికారులు విఫల మవుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రానికి కూడా నీరు అందించలేరా
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ స్థాయీసంఘాల సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 6: జిల్లా కేంద్రానికి కూడా తాగునీరు అందించడంలో అధికారులు విఫల మవుతున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ భవనంలో జిల్లా పరిషత్‌ సీఈవో రత్నమాల అధ్యక్షతన నిర్వహించిన సాయీసంఘాల సమావే శంలో పాల్గొని వివిధశాఖల పనితీరుపై సమీక్ష చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్‌ భగీ రథ ద్వారా జిల్లా కేంద్రానికి కూడా నీరు అందించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంతో పోలిస్తే జిల్లాలో అనేకప్రాంతాలకు ఇప్పటికే నీరు అందంచా మని అయితే పథకాన్ని మరింత పకడ్బందీగా నిర్వ హించాలన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే క్షమించేది లేదని హెచ్ఛరించారు. తిర్యాణి మండలంలోని రహదారుల పరిస్థితి అధ్వాన్నం గా ఉందని మండలంలోని కుమరంభీం చౌరస్తా నుంచి అమీన్‌గూడ వరకు, త్రీఇంక్లైన్‌ నుంచి లింగాపూర్‌ వరకు రోడ్డు పూర్తి చేయాలన్నారు. అవస రమైన అదనపు నిధులకోసం ఉన్నతాధికారులకు విన్నవించి నట్లు రహదారులు భవనాలశాఖ అధికారి వివరిం చగా దానికి సంబంధించిన నివేదికలు తనకు అందజే యాలని సూచించారు. వ్యవసాయ, అటవీ, మత్స్య శాఖలకు సంబంధించి జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు సమీక్ష చేశారు. ఏదీ ఏమైనా ఏడు స్థాయీ సంఘాలు 42శాఖలపై సమీక్ష చేయాల్సి ఉండగా కొన్ని శాఖలపై మాత్రమే సమీక్ష జరిగింది. ప్లాస్టిక్‌ నిషేధించిన నేపథ్యంలో జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశంలో పేపర్‌ గ్లాసులో నాయకులకు అధికారులు నీళ్లు అందించారు. సమావేశంలో జిల్లాలోని అన్నిమండలాల జడ్పీటీసీలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T04:50:49+05:30 IST