ఈ యాప్‌లతో పనిచేయలేం

ABN , First Publish Date - 2022-08-19T05:25:54+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను ఆప్‌లోడ్‌ చేయడానికి విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటీగ్రేటెడ్‌ యాప్‌ను తమ సొంత ఫోన్లలో డౌనలోడ్‌ చేసుకుని, విధులు నిర్వహించలేమని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నా రు.

ఈ యాప్‌లతో పనిచేయలేం
కదిరిలో ప్రఽధానోపాధ్యాయురాలికి వినతిపత్రం అందిస్తున్న ఫ్యాప్టో నాయకులు


ఉపాధ్యాయ  సంఘాల వినతి 

 తనకల్లు, ఆగస్టు 18: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను ఆప్‌లోడ్‌ చేయడానికి విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఇంటీగ్రేటెడ్‌ యాప్‌ను తమ సొంత ఫోన్లలో డౌనలోడ్‌ చేసుకుని, విధులు నిర్వహించలేమని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నా రు. ఈ మేరకు స్థానిక ఎమ్మార్సీలో గురువారం ఎంఈఓ లలితమ్మకు  వినతిపత్రం అందించారు.  ఈ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోవడం ద్వారా తమ వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలిసే అవకాశముందన్నారు. అందువలన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వం స్పందిం చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌టీయూ నా యకులు లక్ష్మీప్రసాద్‌, ఎనటీఏ  శివశంకర్‌, యూటీఎఫ్‌ ఖాజా మోద్దీన, ఏపీటీఎఫ్‌ శ్రీనివాసులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

ఓబుళదేవరచెరువు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ ను వ్యతిరేకిస్తూ గురువారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యా యులు స్థానిక ఎమ్మార్సీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ పనిచేకపోగా, రోజు ఇబ్బందులు పడాల్సి వస్తోంద న్నారు. ఈయాప్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎంఈఓ చెన్నక్రిష్ణకు వినతిప్రతం అందించారు.  ఉపాధ్యాయ సంఘం నాయకులు దార్ల రాజశేఖర్‌, రాంకుమార్‌, జనార్దన, మోహనరెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, చంద్రమోహన, షబ్బీర్‌, శ్రీనివాసులు, సుధాకర్‌నాయక్‌, రమణ, బాలాజీనాయక్‌, ఓబులేసు తదితరులున్నారు. 

అమడగూరు: ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ తో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మండ లంలోని జేకేపల్లి, మహమ్మదాబాద్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌, అమడగూరు జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో యాప్‌ అప్‌లోడ్‌ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఈయాప్‌ వలన వ్యక్తిగత సమాచారానికి ఇబ్బందులుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈయాప్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వమే డివైజ్‌లను సరఫరా చేయాలి 

కదిరిఅర్బన: యాప్‌ ద్వారా ఉపాధ్యాయులు ముఖ హాజరును వేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ప్రభుత్వమే ఆధునాతన డివైజ్‌లను సరఫరా చేయాలని ఫ్యాప్టో నాయకులు గురువారం స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధాయురాలికి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం డివైజులు పరషరా చేస్తే ప్రభుత్వం నిర్వహిం చమనే అన్నిరకాల యాప్‌లు నిర్వహిస్తామన్నారు. ఫ్యాప్టో నాయకులు త్రిమూర్తి, శ్రీనివాసులు, పీవీ శ్రీనివాసలరెడ్డి తదితరులున్నారు.

 


Updated Date - 2022-08-19T05:25:54+05:30 IST