కెప్టెన్సీ జన్మహక్కు కాదు: గౌతం గంభీర్

ABN , First Publish Date - 2022-01-18T01:30:20+05:30 IST

టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సంచలన..

కెప్టెన్సీ జన్మహక్కు కాదు: గౌతం గంభీర్

న్యూఢిల్లీ: టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ఏ ఒక్కరి జన్మహక్కు కాదని తేల్చి చెప్పాడు. ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్ నుంచి కోహ్లీ పగ్గాలు చేపట్టాడని పేర్కొన్న గంభీర్.. మూడు ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్న ధోనీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కోహ్లీ కెప్టెన్సీలో ఆడాడని గుర్తు చేశాడు.


కోహ్లీ ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకోవడంతో  ఇకపై ఆటపై దృష్టి కేంద్రీకరించాలని సూచించాడు. కెప్టెన్సీని కోహ్లీ వదులుకోవడం వల్ల జట్టులో ఎలాంటి మార్పు రాదని, కాకపోతే టాస్ వేయడం, ఆటగాళ్ల మోహరింపు వంటి వాటిలో మాత్రం కొంత మార్పు కనిపిస్తుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.


కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎంతగానో శ్రమించాడని, విజయం కోసం కలలు కన్నాడని గంభీర్ పేర్కొన్నాడు. నిజానికి ఏ దేశ ఆటగాడికైనా దేశానికి ఆడడం మించిన గౌరవం మరోటి ఉండదన్న గంభీర్.. కోహ్లీ ఇకపై జట్టు కోసం పరుగులు సాధించాల్సిన అవసరం ఉందన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ స్థానంలో మార్పు ఉండకపోవచ్చని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2022-01-18T01:30:20+05:30 IST