కబ్జా కాండ..!

ABN , First Publish Date - 2021-10-27T06:57:23+05:30 IST

అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జాకాండకు తెరలేపారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని జన్మభూమినగర్‌లో జాతీయ రహదారి పక్కన రూ.కోట్లు విలువచేసే భూమిపై రాప్త్తాడు ఎ మ్మెల్యే ఆనుచరుల కన్ను పడింది.

కబ్జా కాండ..!
ధ్వంసం చేసిన కంచె

రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్‌తో కంచె ధ్వంసం చేసిన రాప్తాడు ఎమ్మెల్యే అనుచరులు

పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయలేదని బాధితుల ఆందోళన

రాప్తాడు, అక్టోబరు 26: అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జాకాండకు తెరలేపారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని జన్మభూమినగర్‌లో జాతీయ రహదారి పక్కన రూ.కోట్లు విలువచేసే భూమిపై రాప్త్తాడు ఎ మ్మెల్యే ఆనుచరుల కన్ను పడింది. దర్జాగా కబ్జా చేసి, రూ.కోట్లు సంపాదించాలని ప్లాన వేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, విలువైన భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో సోమవారం రాత్రికి రాత్రే దౌర్జన్యంగా ఎక్స్‌కవేటర్లతో కంచెను ఽధ్వం సం చేశారు. భూమి వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డు కిటికీలు, విద్యుత మీటర్లను ధ్వంసం చేశారు. ఈ స్థలం జోలికి ఎవరూ రావొద్దని బెదిరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జి ల్లా ఎస్పీ, అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. బాధితుల కథనం మేరకు.. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలోని జన్మభూమినగర్‌లో జాతీయ రహదారి పక్కన 1-1 సర్వే నెంబర్‌లో మొత్తం 11.73 ఎకరాల భూమి ఉం ది. అందులో 7 ఎకరాలు గతంలో చెన్నమ్మ అనే మహిళ అశ్వత్థరెడ్డి అనే వ్యక్తికి విక్రయించింది. ఆ యన ఆ భూమిని ప్లాట్లు వేసి 1995 నుంచి 2000 సంవత్సరం వరకూ దాదాపు 70 మందికి సెంట్ల ప్రకారం విక్రయించి, రిజిస్ర్టేషన చేయించాడు. ఆ తరువాత కొంత మంది ఆ స్థలాలను ఇతరులకు అ మ్మారు. ఆ స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు తమ స్థలం చుట్టూ కంచె వేసుకున్నారు. కొంతమంది పునాదుల నిర్మాణాలకు ట్రెంచులు తవ్వారు. అక్కడ సెంటు భూమి ప్రస్తుతం రూ.10 లక్షలుపైగా పలుకు తోంది. అనంతపురం నగరానికి దగ్గర, విలువైన భూ మి కావడంతో దానిపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచరుల కన్ను పడింది. ఆ భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, కబ్జా చేసుకుని రూ.కో ట్లు సంపాదించాలని ప్లాన వేసుకున్నారు. గతంలో కూడా ఒకసారి రాత్రి సమయంలో ఎక్స్‌కవేటర్‌తో కంచెను ధ్వంసం చేయించారు. దీంతో బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కంచెను ధ్వంసం చేసిన వారు ఆ భూమికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు కూడా చూపకుండా స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు మరోసారి సోమవారం రాత్రి ఎక్స్‌కవేటర్‌తో ఆ భూమిలో లబ్ధిదారులు ప్లా ట్లకు వేసుకున్న కంచెలను ధ్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన షెడ్డు కిటికీ అద్దాలు, విద్యుత మీటరు ధ్వంసం చేశారు. దీంతో లబ్ధిదారులు దాదాపు 60 మంది మంగళవారం ఉదయం స్థలాల వద్ద ఆందోళనకు దిగారు. కష్టపడి సంపాదించుకుని స్థలాలు కొంటే కబ్జాదారులు అన్యాయంగా, దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చెం దుతున్నారు. నిజంగా స్థలాలు వారివైతే రాత్రి సమయంలో వచ్చి ఎందుకు ధ్వంసం చేయిస్తారని కోపోద్రిక్తులయ్యారు. రామచంద్రారెడ్డి, కుమార్‌నాయక్‌, నాగరాజు తాము రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచరులమనీ, ఆ స్థలాలు తమవేనని చెబుతున్నారని బాధితులు వీరప్ప, నాగరాజు, సాలార్‌బాషా, పెద్దన్న, శంకర్‌రెడ్డి, శివశంకర్‌, రాము, సలీం తదితరులు ఆవేదన చెందారు. మంగళవారం బాధితులు మరోసారి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే తమకు న్యా యం చేయాలనీ, కబ్జాకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని వే డుకుంటున్నారు. దీనిపై కేసు నమో దు చేసినట్లు తెలిసింది.



Updated Date - 2021-10-27T06:57:23+05:30 IST