వాకింగ్‌ చేస్తున్న యువకుడిపైకి కారు

Published: Wed, 06 Jul 2022 01:11:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వాకింగ్‌ చేస్తున్న యువకుడిపైకి కారు

అక్కడికక్కడే మృతి

ప్రత్తిపాడు, జూలై 5: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు హైవే నిర్వహణ యార్డు సమీపంలో మంగళవారం ఇన్నోవా కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ సీహెచ్‌ సుధాకర్‌ అందించిన వివరాలు ప్రకారం.. ప్రత్తిపాడు సాయినగర్‌కు చెందిన పతి భువనచంద్ర (26) వాకింగ్‌ కోసం మంగళవారం జాతీయ రహదారిపై వెళ్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో భువనచంద్ర తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యావంతుడైన భువన చంద్ర వాకింగ్‌ కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో సాయినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి పతి శ్రీనివాస్‌, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.