Elephant: కారును ధ్వంసం చేసిన ఏనుగు

ABN , First Publish Date - 2022-08-03T16:28:02+05:30 IST

నీలగిరి జిల్లా కల్లింగరై - పాడందొరై మార్గంలో మంగళవారం ఉదయం ఓ అడవి ఏనుగు(Elephant) రహదారిపై బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలిచి

Elephant: కారును ధ్వంసం చేసిన ఏనుగు

చెన్నై, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): నీలగిరి జిల్లా కల్లింగరై - పాడందొరై మార్గంలో మంగళవారం ఉదయం ఓ అడవి ఏనుగు(Elephant) రహదారిపై బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ఓ కారును ధ్వంసం చేసింది. రోడ్డుపక్కనే ఉన్న చెత్తకుప్పలను తొండంతో విసిరికొట్టింది. ఆ ఏనుగును చూసి వాహనదారులు భయంతో నలువైపులా పరుగులు తీశారు.  సమాచారం అందుకున్న అటవీశాఖ(Forest Department) అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి ఆ ఏనుగును మళ్ళీ అడవిలోకి తరిమికొట్టారు.

Updated Date - 2022-08-03T16:28:02+05:30 IST