కారులో తరలిస్తున్న విగ్రహాల స్వాధీనం

Nov 19 2021 @ 09:21AM

పెరంబూర్‌(చెన్నై): విల్లుపురం సమీపంలో కారులో తరలిస్తున్న విగ్రహా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం సమీపం కిలియనూర్‌ చెక్‌ పోస్ట్‌ పరిధిలో పుదువై- దిండి వనం జాతీయ రహదారిపై ప్రత్యేక ఎస్‌ఐ శ్రీపతి నేతృ త్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆ మార్గంలో అతివేగంగా వచ్చిన కారును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూసిన డ్రైవర్‌ కారు ఆపి పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు అతనిని వెంటాడి పట్టుకున్నారు. కారును తనిఖీ చేసిన పోలీసులు రాముడు, ఆంజనేయుడు, పెరుమాళ్‌ విగ్రహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కారు డ్రైవర్‌ మనోహరన్‌ను విచారించగా, తంజావూరు జిల్లా పుంపుహార్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్‌కు ఇత్తడితో తయారుచేసిన విగ్రహాలను తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.