రష్యాలో కార్గో విమానం Crash Lands...ముగ్గురి మృతి

Published: Fri, 24 Jun 2022 08:07:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రష్యాలో కార్గో విమానం Crash Lands...ముగ్గురి మృతి

మాస్కో(రష్యా): రష్యా దేశంలో కార్గో విమానం శుక్రవారం ఉదయం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూలిపోయి మంటలు చెలరేగాయి. రష్యాదేశానికి చెందిన ఇల్యుషిన్ ఇల్ -76 కార్గో విమానం రియాజాన్ నగరానికి సమీపంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయి మంటలు చెలరేగాయి. కూలిపోయిన విమానంలో 9మంది ఉండగా వారిలో ముగ్గురు మరణించారు. విమానంలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కూలిపోయిన విమానాన్ని ఏ సంస్థ నడిపిందనే విషయంపై స్పష్టత రాలేదు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.