Advertisement

యమపాశం

May 4 2021 @ 22:38PM
అంత్యక్రియలు నిర్వహిస్తున్న ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆప్‌ ఇండియా‘ సభ్యులు

- విలయం సృష్టిస్తోన్న కరోనా 

- రోజూ పెరుగుతున్న మృతుల సంఖ్య

- జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే రోజు 9 మంది మృత్యువాత

- బాధితుల్లో నెలకొన్న భయాందోళన


గద్వాల క్రైం/అయిజ, మే 4 : కనీ విని ఎరుగని రీతిలో కరోనా వైరస్‌ జడలు విప్పుతోంది.. మొదటి దశకన్నా రెందో దశలో భయంకరంగా మారుతోంది.. దీన్ని అంతమొందించేందుకు టీకా అందుబాటులోకి వచ్చినా, ఈ క్రిమి ప్రజలపై ముప్పేట దాడి చేస్తోంది.. యమపాశంలా మారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.. వారం రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రోజూ ఇద్దరు, ముగ్గురు ప్రాణాలను మింగేస్తూ రాగా, తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం ఒక్క రోజే తొమ్మిది మందిని పొట్టన పెట్టుకున్నది.. దీంతో ప్రతీ నిమిషం ప్రజలు భయం భయంగా గడుపుతున్న పరిస్థితి నెలకొన్నది..

జోగుళాంబ గద్వాల జిల్లాను కరోనా గడగడలాడిస్తోంది. మొ దటి దశ కంటే రెండో దశలో మహమ్మారి ఎక్కువ మంది ప్రాణాలను బలిదీసుకుంటోంది. వారం రోజులుగా రోజూ ఒకరు లేదా ఇద్దరు కరోనాతో మృత్యువాత పడుతూ రా గా, సోమవారం జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వరకు మరో 9 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ వార్డులోని మిగిలిన రోగుల్లో భయాందోళన నెలకొన్నది. తమ ప్రాణాలు కూడా పోతాయేమోనన్న భయంతో వణికిపోతున్నారు. ఈ మరణాల కు డాక్టర్ల నిర్లక్ష్యమా? లేక బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడమ అనేది అంతుచిక్కడం లేదు.


ఫ్రెండ్స్‌.. మీకు సెల్యూట్‌

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా అని చెప్పేలోపే ప్రజ లు ఆమడ దూరం పారిపోతున్నారు. పాటిజివ్‌ వచ్చిందని తె లిస్తే ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావడం లేదు. అ లాటింది ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడని తెలిస్తే, అతడి మృతదేహాన్ని అనాథగా వదిలేసుతన్నారు. అంత్యక్రియలు నిర్వ హించడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. ఇలాంటి సంఘటనలు రోజూ పత్రికలు, టీవీలలో చూ స్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మాత్రం ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆప్‌ ఇం డియా’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కరోనా కష్టకాలంలో తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కొవిడ్‌తో మృతి చెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వానికి మించిన కులం, మతం లేదని నిరూపించారు.


కొత్తగా 1,450 మందికి కరోనా

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/ గద్వాల క్రైం/ నారాయణపేట క్రైం/ వనపర్తి (వైద్యవిభాగం)/ నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి), మే 5 : ఉమ్మడి పాలమూరులో కరో నా మృత్యుఘంటికలు మోగిస్తోంది. వైరస్‌ బారిన పడి జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం ఒక్క రోజే తొమ్మిది మంది మృతి చెందారు. వనపర్తి జిల్లాలో మరొకరు చనిపోయారు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో మంగళవా రం 1,450 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 226 మందికి వైరస్‌ సోకింది. 

- జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం 251 మంది కరోనా బారిన ప డ్డారు. పట్టణంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1311 మందికి కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా 556 మంది కరోనా బారిన పడ్డట్లు తేలింది. 

- వనపర్తిలో 319 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీపనగండ్ల మండలం గోవర్ధన గిరికి చెందిన ఒకరు (50) కర్నూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

- నారాయణపేట జిల్లాలో 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Follow Us on:
Advertisement