కరోనా.. విశ్వరూపం

ABN , First Publish Date - 2020-07-14T09:59:05+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గతంలో రోజుకు పది, పది హేను కేసులు వస్తుండగా..

కరోనా.. విశ్వరూపం

 పేట్రేగుతున్న మహమ్మారి

జిల్లాలో ఒకే రోజు 387 కేసులు

గుంటూరు నగరంలో 243 కేసులు

చికిత్స పొందుతూ ముగ్గురు మృతి


ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 13: జిల్లాలో కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గతంలో రోజుకు పది, పది హేను కేసులు వస్తుండగా కొన్ని రోజులుగా వందల సంఖ్యలో వస్తున్నాయి. జిల్లాలో సోమవారం ఏకంగా 387 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరులోనే 243 కేసులు వెలుగు చూశాయి. మహరాష్ట్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ రాగా, క్వారంటైన్‌ కేంద్రాల్లోని మరో 12 మంది కూడా ఉన్నారు. ఒక్కరోజులో 300 కేసులు దాటడం జిల్లాలో ఇదే తొలిసారి. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. కొవిడ్‌-19కు చికిత్స పొందుతూ ముగ్గురు సోమవారం మృతి చెందారు. జిల్లా  వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సోమవారం విడుదల చేసిన కేసుల వివరాలు పరిశీలిస్తే.. గుంటూరు నగర పరిధిలోని ఏటీ అగ్రహారం, బాలాజీనగర్‌,  వికాస్‌నగర్‌,  రైలుపేట, కార్మికులకాలనీ, కొత్తపేట, ఇన్నర్‌రింగ్‌రోడ్‌, పట్నంబజార్‌,  సాంబశివపేట, యాదవలబజార్‌, చల్లావారివీధి, చౌత్రా, శ్రీనగర్‌, కేవీపీకాలనీ, ఏటుకూరురోడ్డు, ఆర్‌అగ్రహారం, ఇజ్రాయల్‌పేట,  కోదండరామయ్యనగర్‌, కృష్ణనగర్‌, శ్రీనివాసరావుతోట, సంపత్‌నగర్‌, పొత్తూరువారితోట, తారకరామానగర్‌, సాయిబాబాకాలనీ, కొబ్బరికాయల సాంబయ్యకాలనీ, లాలాపేట, మంగళదాస్‌నగర్‌, జేకేసీ కాలేజీ రోడ్డు, సంజీవయ్య నగర్‌, విజయశాంతినగర్‌, చంద్రబాబునాయుడుకాలనీల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా ప్రకటించారు. రత్నపూరి కాలనీ, గుంటూరువారితోట, అరండల్‌పేట, గోరంట్ల, రాజేంద్రనగర్‌, శ్రీరామనగర్‌, అశోక్‌నగర్‌ ప్రాంతాల్లో ఇద్దరికి, లక్ష్మీపురం, రెడ్లబజార్‌, ఆర్టీసీకాలనీల్లో ముగ్గురికి, సంగడిగుంట, నెహ్రూనగర్‌ ప్రాంతాల్లో నలుగురికి చొప్పున, ఏటుకూరులో 14 మందికి, నల్లచెరువు, ఐపీడీకాలనీల్లో 10 మందికి, పాతగుంటూరులో ఐదుగురికి,    చాకలికుంటలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది.


అయితే డీఎంహెచ్‌వో నివేదిక ప్రకారం 243 కేసులు కాగా వివరాలు మాత్రం 108 మందివే ప్రకటించారు. ఇక జిల్లాలోని  అచ్చంపేట, బాపట్ల, దాచేపల్లి, దుగ్గిరాల, యడ్లపాడు, గుంటూరు రూరల్‌, ఈపూరు, నూజెండ్ల, పెదకూరపాడు, రొంపిచర్ల, తుళ్లూరు, వట్టిచెరుకూరు, వేమూరు మండలాల్లో ఒక్కొక్కరికి, క్రోసూరు,  మాచర్ల  పెదకాకాని, పొన్నూరు, శావల్యాపురం, తాడికొండ, చుండూరు మండలాల్లో ఇద్దరికి చొప్పున, గురజాల, పిడుగురాళ్ల, రేపల్లెలో ముగ్గురికి చొప్పున, అమరావతి, చిలకలూరిపేటల్లో ఐదుగురికి చొప్పున పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు. ఇక మంగళగిరిలో 16, నరసరావుపేటలో 25, బొల్లాపల్లిలో 6, పెదనందిపాడులో 4, సత్తెనపల్లిలో 6, తాడేపల్లిలో 16, తెనాలిలో 23 కేసులు వచ్చినట్లు తెలిపారు. 


- ప్రత్తిపాడులో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల మరణించిన టీస్టాల్‌ దుకాణదారుడికి కరోనా రావడంతో అతడి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మృతుడి కుటుంబసభ్యులకు ముగ్గురితో పాటు పక్కింట్లోని ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌కు కూడా పాజిటివ్‌ వచ్చింది.  


- పెదనందిపాడు మండలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. పెదనందిపాడు సచివాలయంలో పని చేస్తున్న ఓ అధికారికి, మద్యం దుకాణంలో ఒకరికి, పాలపర్రులో ఓ బ్యాంకు ఉద్యోగికి, ఏబీపాలెంలో పిండి మర నిర్వహకుడికి కరోనా వచ్చినట్లు అధికారులు తెలిపారు. 


- చిలకలూరిపేటలోని రెడ్లబజారులో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇతడు పెదనందిపాడు మండలం పాలపర్రులోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నట్లు, నిత్యం విధులకు వెళ్లి వస్తుంటారని అధికారులు గుర్తించారు. నాదెండ్ల మండలం గణపవరంలో ఓ స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేసే ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. ఇతడు ఇటీవల తన బంధువులు ఐసోలేషన్‌ కేంద్రంలో ఉంటే వెళ్లి పరామర్శించి వచ్చిన క్రమంలో పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.  


- పొన్నూరు మండలం చింతలపూడిలో కూల్‌డ్రింక్‌ షాపు నిర్వహిస్తున్న ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి తెలిపారు. 1వ వార్డులో ఓ గర్భిణికి పాజిటివ్‌ సోకిందని కమిషనర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. 


- వేమూరు మండలం పెరవలి, జంపని గ్రామాల్లో ఒక్కొక్క కేసు వచ్చినట్లు వైద్యాధికారి వెంకటసురేష్‌ తెలిపారు. ఓ యువకుడు హత్య కేసులో నిందితుడైన జంపనికి చెందిన యువకుడ్ని ఈ నెల 11న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన క్రమంలో పరీక్షలు నిర్వహించగా కరోనాగా తేలింది. దీంతో అతడ్ని జైలుకు తీసుకెళ్లిన పోలీసులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. 


- సత్తెనపల్లి సంగంబజారులో ఒకటి, నాగార్జుననగర్‌లో రెండు, బోయకాలనీలో ఒక కేసు వచ్చినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని పాకాలపాడులో 63 మందికి, రెంటపాళ్ళలో 36 మందికి స్వాబ్‌ టెస్ట్‌లు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్‌ శేషుయాదవ్‌ చెప్పారు. 


- వినుకొండ లాయర్స్‌స్ర్టీట్‌లో 3, ఆరెంజ్‌ స్టోర్‌ వద్ద ఒక కేసు నమోదయ్యాయి. 


- తాడికొండ మండలం లాం గ్రామానికి చెందిన వ్యక్తి(47) గుంటూరులో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇతడికి పరీక్షలు నిర్వహించగా సోమవారం వచ్చిన నివేదికలో కరోనాగా తేలింది. దీంతో  అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.   మృతుడి నివాసం ఉండే ప్రాంతాన్ని ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ పరిశీలించారు. ఇక ఫణిదరంలో ఇద్దరికి, బడేపురంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారించారు.


- మంగళగిరి మండలం నవులూరు, చినకాకానిలో ఒక్కొక్కరికి, కాజలో 2, ఆత్మకూరులో 5 కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.  


- దాచేపల్లి మండలంలో 13 కేసులు వచ్చాయి. దాచేపల్లి నగర పంచాయతీలో రెండు, నారాయణపురం, ఎంఎస్‌పేట, కేశానుపల్లిలో ఒక్కొక్కరికి, గామాలపాడులో ఎనిమిదికేసులు వచ్చాయి.


- చుండూరు మండలం యడ్లపల్లిలో ఓ తల్లీకూతురుకి పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ విజయజ్యోతికుమారి తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే ఓ ఉద్యోగికి పాజిటివ్‌ సోకింది. బెల్లంకొండ మండలం రామాంజనేయపురం గ్రామంలో ఉండే ఓ గ్రామ రెవెన్యూ సర్వేయర్‌కు పాజిటీవ్‌గా నిర్ధారించారు. విజయపురిసౌత్‌ డౌన్‌ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన ఒకరికి కరోనా వచ్చినట్లు మాచర్ల తహసీల్దార్‌ సీహెచ్‌ వెంకయ్య తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, మరో ఉద్యోగునికి పాజిటివ్‌ వచ్చిన సమాచారంతో ఉద్యోగులలో అలజడి నెలకొంది.    


నరసరావుపేటలో 30 మందికి

నరసరావుపేట: నరసరావుపేటలో 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. మహాత్మాగాంఽధీ అస్పత్రిలో నిర్వహించిన పరీక్షలలో 12 మందికి, ప్రభుత్వ అసుపత్రిలో నిర్వహించిన పరీక్షలలో 18 మందికి పాజిటివ్‌గా గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. 30బరంపేటలో 4, ప్రకాష్‌నగర్‌, మల్లమ్మసెంటర్‌, 2వ వార్డు, సత్తెనపల్లి రోడ్డు, వరవకట్ట ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మండలంలోని రావిపాడులో, కొండకావూరులో ఇద్దరికి చొప్పున, ములకలూరులో, అల్లూరివారిపాలెంలో ఒక్కొక్కరికి కరోనా సోకింది.  


తెనాలిలో 23 పాజిటివ్‌ కేసులు

తెనాలి అర్బన్‌: తెనాలి పట్టణంలో 21, రూరల్‌ మండల గ్రామాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. నాజరుపేటలో 6, నందులపేటలో 3, మారీసుపేటలో 3, సాలిపేట 2, ఇస్లాంపేట 2, చినరావూరుతోట, ఆర్‌ఆర్‌నగర్‌, బాలాజీరావుపేట, షరాఫ్‌బజారు, చినరావూరులో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. జగ్గడిగుంటపాలెం, కొలకలూరు ఒక్కో కేసు వచ్చింది. వీరిలో ఓ వలంటీర్‌, మున్సిపల్‌ ఉద్యోగి, ఆర్డీవో కార్యాలయ డ్రైవర్‌, ఓ న్యాయవాది కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. కొల్లిపర మండలం దావులూరిపాలెం, దావులూరు,  మున్నంగి గ్రామాల్లో కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. 


Updated Date - 2020-07-14T09:59:05+05:30 IST