155 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-30T04:55:48+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం 155 కరోనా కేసులు నమోదయ్యాయి.

155 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం 155 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగా రెడ్డి జిల్లాలో 125 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోద య్యాయి. ఇప్పటివరకూ ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,05,933కు చేరుకుంది.


 చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల :  చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 108మందికి కరోనా పరీక్షలు చేయగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యులు తెలిపారు. ఆదివారం చేవెళ్ల, శంకర్‌ పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ తదితర మండలాల్లో కరోనా పరీక్షలు చేయడం జరిగిం దన్నారు. అయితే కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు.


శాంతించిన కరోనా 

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో కరోనా వైరస్‌ ఉధృతి శాంతించినట్లు కనిపిస్తున్నది. ప్రతిరోజూ చేస్తున్న ర్యాపిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం షాద్‌నగర్‌ డివిజన్‌పరిధిలోని షాద్‌నగర్‌ పీపీ యూనిట్‌తోపాటు బూర్గుల, చించోడ్‌, కొందుర్గు, కేశంపేట, కొత్తూర్‌, నందిగామా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 171 మందికి పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యులు నిర్ధారించారు. 

Updated Date - 2020-11-30T04:55:48+05:30 IST