మరో 1,270 కేసులు

ABN , First Publish Date - 2020-08-08T09:22:34+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈనెల 6న అను మానితులకు చేసిన శ్వాబ్‌ పరీక్షల్లో 1,270 మందికి కొవిడ్‌-19 వైరస్‌..

మరో 1,270 కేసులు

28,850 కు చేరిన పాజిటివ్‌ బాధితులు8 కాకినాడ అర్బన్‌లో 268, రూరల్‌లో 41

రాజమహేంద్రవరం అర్బన్‌లో 144, రూరల్‌లో 18

అమలాపురంలో 83 కేసులు 


కాకినాడ (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఈనెల 6న అను మానితులకు చేసిన శ్వాబ్‌ పరీక్షల్లో 1,270 మందికి కొవిడ్‌-19 వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో సదరు పాజిటివ్‌ల సంఖ్య 28,850కి చేరింది. ఎప్పటిలాగే ప్రధాన నగరాల్లో కరోనా తన ప్రభావం చూపుతోంది. గడిచిన రెండు వారాల నుంచి 100 నుంచి 300లోపు ఈ రెండు ప్రాంతాల్లో పాజిటివ్‌లు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా  కాకినాడ అర్బన్‌లో 268, రూరల్‌లో 41, రాజమహేంద్రవరం అర్బన్‌లో 144, రూరల్‌లో 18, అమలాపురంలో 83 కేసులు నమోదయ్యాయి.


అడ్డతీగలలో 5, అయినవిల్లిలో 15, ఆలమూరులో 9, అల్లవరంలో 6, అంబాజీపేటలో 8, ఆత్రేయపురంలో 8, బిక్కవోలు 1, చింతూరు 15, దేవీపట్నం 15, గోకవరం 18, గొల్లప్రోలు 42, ఐ పోలవరం 18, జగ్గంపేట 5, కడియం 15, కాజులూరు 22, కరప 23, కాట్రేనికోన 3, కోరుకొండ 8, కొత్తపల్లి 7, కొత్తపేట 12, మల్కిపురం 6, మామిడికుదురు 2, మండపేట 19, మారేడిమిల్లి 16, ముమ్మిడివరం 3, నెల్లిపాక 9, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు 1, పి గన్నవరం 7, పామర్రు 20, పెదపూడి 28, పెద్దాపురం 21, పిఠాపురం 44, ప్రత్తిపాడు 2, రాజానగరం 23, రాజవొమ్మంగి 3, రంపచోడవరం 22, రామచంద్రపురం 3, రంగంపేట 2, రావులపాలెం 3, రాయవరం 29, రాజోలు 5, రౌతులపూడి 4, సామర్లకోట 44, శంఖవరం 18, తొండంగి 32, తుని 17, యు కొత్తపల్లి 39, ఉప్పలగుప్తం 8, వై రామవరం 6, ఏలేశ్వరం 2 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-08T09:22:34+05:30 IST