కరోనా... పురుషుల్లోనే ఎక్కువ... తాజా అధ్యయనాల్లో వెల్లడి..

ABN , First Publish Date - 2021-04-23T23:09:37+05:30 IST

ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల్లో... పురుషులే అధిక సంఖ్యలో ఉన్నారు. మరణాల సంఖ్యలో కూడా పురుషులే అధికంగా ఉండడం గమనార్హం.

కరోనా... పురుషుల్లోనే ఎక్కువ... తాజా అధ్యయనాల్లో వెల్లడి..

ముంబై : ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల్లో... పురుషులే అధిక సంఖ్యలో ఉన్నారు. మరణాల సంఖ్యలో కూడా పురుషులే అధికంగా ఉండడం గమనార్హం. అమెరికాలోని రెండు  రాష్ట్రాల్లో... పురుషులు, మహిళలపై ఈ అధ్యయనం... జర్నల్ ఆఫ్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైంది. కాగా... గతంలో జరిగిన పలు అధ్యయనాల మాదిరిగానే... ఇది కూడా   కోవిడ్ -19 కి ఎక్కువగా పురుషులే గురవుతున్నారని వెల్లడించింది.


అయితే తెల్లజాతీయుల కంటే నల్లజాతి మహిళలు కరోనాతో చనిపోయే అవకాశం నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నట్లు తేలింది. ఆసియా అమెరికన్ పురుషుల కంటే నల్లజాతి మహిళలు మూడురెట్లు ఎక్కువగా కరోనా బారిన పడి మరణిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నల్లజాతి స్త్రీలు, అక్కడి పురుషుల కంటే తక్కువగా ఉన్నారు. అలాగే తెల్లజాతి స్త్రీలు కూడా ఆసియా అమెరికన్ పురుషుల కంటే తక్కువగానే ఉన్నారు.


ఆసియా, పసిఫిక్ ద్వీపాల్లో ఉండే తెలుపు, నలుపు జాతులకు చెందిన వారిని రెండు జెండర్స్ గా చేసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రేస్, జెండర్ రెండింటి ద్వారా నిర్వచించబడిన ఆరు గ్రూపుల్లో నల్లజాతి పురుషులు అత్యధికంగా కరోనా బారిన పడి మరణిస్తున్నట్లుగా తేలింది. 

Updated Date - 2021-04-23T23:09:37+05:30 IST