వ్యాక్సినో..రామచంద్రా!

ABN , First Publish Date - 2021-04-22T05:29:43+05:30 IST

ప్రభుత్వాసుపత్రుల్లో మూడవ రోజు బుధవారం కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌ చేశారు. మొదటి, రెండవ డోస్‌లు వేయించుకునే వారికి నిరాశే మిగిలింది.

వ్యాక్సినో..రామచంద్రా!
పాలకొల్లు ఆసుపత్రిలో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుమిగూడిన జనం

సాధారణ ప్రజానీకానికి అందని వ్యాక్సిన్‌

ఐదు రోజులుగా ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే ఆసుపత్రుల్లో టీకా

నేడు రెండో డోసు వారికే అవకాశం

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

వ్యాపార దుకాణాల సమయాల కుదింపు

ఆకివీడు/ ఉండి/కాళ్ళ/ పాలకొల్లు రూరల్‌/అర్బన్‌/వీరవాసరం, ఏప్రిల్‌ 21 : ప్రభుత్వాసుపత్రుల్లో మూడవ రోజు బుధవారం కూడా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌ చేశారు. మొదటి, రెండవ డోస్‌లు వేయించుకునే వారికి నిరాశే మిగిలింది.ఆకివీడు, ఉండి, కాళ్ళ, లంకలకోడేరు, వీరవాసరం ఆసుపత్రుల్లో గురువారం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకాలు వేశారు. గత మూడు రోజులుగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే టీకాలు వేస్తున్నారు..మా సంగ తేమిటని సాధారణ ప్రజానీకం వైద్య సిబ్బందిని నిలదీస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఉన్న తాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. కాళ్ళ పీహెచ్‌సీకి బుధవారం కేవలం 10 మంది ఉద్యోగులు మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి రావడంతో వారికి మాత్రమే వేశామని వైద్యాధికారులు చెప్పారు. ఇంకా 30 డోసులు వ్యాక్సిన్‌ నిల్వ ఉందన్నారు. ఉద్యోగులు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి రానప్పుడు వృద్ధులకు ఎందుకు వేయకూడదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్‌సీలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 30 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. పాలకొల్లు పట్ణణంలో ప్రభుత్వాసుపత్రి, బంగారువారి చెరువుగట్టు, సుభాష్‌ చంద్ర బోస్‌ హైస్కూల్‌, ఎంఎంకెఎన్‌ఎం హైస్కూల్స్‌ వద్ద బుధవారం 400 మంకి వ్యాక్సిన్‌ వేసినట్టు నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్‌ తెలిపారు. ఆకివీడు సీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.ఒంట్లో నలతగా ఉండడంతో బుధవారం వైద్యుల అనుమతితో వీఆర్‌డీఏ పరీక్ష చేయి ంచుకోగా పాజిటివ్‌ అని తేలడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు.కాళ్ళ పీహెచ్‌సీ పరిధిలో 22 మందికి, పాలకొల్లు పట్టణంలో 50 మందికి, పూలపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద 40 మందికి కరోనా పరీక్షలు చేసి నట్టు వైద్య సిబ్బంది తెలిపారు.


నేడు రెండో డోసు వారికి వ్యాక్సిన్‌

42 రోజులు దాటితేనే ఆసుపత్రులకు రండి

ఉండి/కాళ్ళ/ పాలకొల్లు రూరల్‌/ఆకివీడు/ వీరవాసరం, ఏప్రిల్‌ 21 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసుకు అర్హత కలిగిన వారంతా గురువారం వ్యాక్సిన్‌ వేయిం చుకోవాలని వైద్య సిబ్బంది, అధికారులు తెలిపారు.ఈ మేరకు జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గురువారం ఉదయం 7 గం టల నుంచి సాయంత్రం వరకు రెండో డోసుకు అర్హత ఉన్నవారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. అర్హత కలిగిన వారికి మండల కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ వస్తుందన్నారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వారు తప్ప మిగిలిన వారెవరు పీహెచ్‌సీలకు (పీహెచ్‌సీ)లకు రావద్దు అన్నారు. మొదటి డోస్‌ వేయించుకుని 42 రోజులు పూర్తయితే రెండో డోస్‌ వేస్తారని తెలిపారు. 


దుకాణాల మూసివేత పరిష్కారం కాదు : గ్రంధి

భీమవరం అర్బన్‌, ఏప్రిల్‌ 21 : కరోనా వైరస్‌పై ప్రజలంతా అప్రమత్తంగా ఉండా లని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టు స్వయం లాక్‌ డౌన్‌ సాయంత్రం 7 గంటల్లోగా పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయని, కానీ అలా చేస్తే ఒకే సారి జనం షాపుల వద్ద గుమిగూడి వైరస్‌ మరింత వ్యాప్తిచేందే అవకాశం ఉందని తన అభిప్రాయం అన్నారు. జిల్లా ఎస్పీ, ప్రభుత్వం తీసుకుని ఆదేశాల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం రాత్రి 9 గంటల వరకు వ్యాపార సముదాయాలు తెరిచే ఉంటాయని, లాక్‌ డైన్‌ పై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో టౌన్‌ సీఐ కృష్ణ భగవాన్‌, రాయుడు, కమిషనర్‌ ఎం.శ్యామల, తహసీల్దార్‌ ఎన్‌వీ రమణరావు తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి 6 గంటల వరకే బంగారు దుకాణాలు

నరసాపురం : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బులియన్‌ అసోసియేషన్‌ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవాలని నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఈ నెల 30 వరకు దీన్ని అమలు చేస్తున్నట్టు ఆ సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు వినోద్‌కుమార్‌జైన్‌, ఆత్మూరి శ్రీనివాస్‌ తెలిపారు.తాకట్టు దుకాణాలు కూడా సాయంత్రం 6 గంటల వరకే ఉంటాయన్నారు.


ఆకివీడులో ఆదివారం లాక్‌డౌన్‌

ఆకివీడు, ఏప్రిల్‌ 21 : వ్యాపారులు కరోనా నియంత్రణకు సహకరిం చాలని ఎస్‌ఐ వీఎస్‌ వీరభద్రరావు, కమిషనర్‌ బోయిన సాల్మన్‌రాజు, డీటీ సునీల్‌కుమార్‌ అన్నారు. స్థానిక ఎరువులు–పురుగు మందుల భవనంలో బుధవారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు నేతృత్వంలో సభ్యులు, వర్తకులతో సమావేశం నిర్వహి ంచారు. మధ్యాహ్నం 3 గంటలకు దుకాణాలు, హోటల్స్‌, సినిమా థియేటర్లు బంద్‌ చేయాలన్నారు. ఆదివారం పూర్తిగా లాక్‌డౌన్‌ అన్నారు. అత్యవసర సేవలైన పాలు, మెడికల్‌ దుకాణాలు ఉంటాయన్నారు.వారపుసంత వేయవద్దని దుకాణదారులకు సూచించారు.


Updated Date - 2021-04-22T05:29:43+05:30 IST