ఇరు జిల్లాల్లో 15మందికి కరోనా

Oct 14 2021 @ 00:49AM

ఖమ్మం కలెక్టరేట్‌/ కొత్తగూడెం కలెక్టరేట్‌/ ఆళ్లపల్లి, అక్టోబరు 13: ఇరు జిల్లాల్లో బుధవారం 15మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4554 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురు, భద్రాద్రి జిల్లాలో 722 మందికి పరీక్షలు నిర్వహిస్తే 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మెత్తం పది మంది చికిత్స పొందు తుండగా బుధవారం ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 310 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో ఓ మహిళ(65) కొవిడ్‌ బారిన పడి మంగళవారం రాత్రి మృతిచెందింది. 

నేటినుంచి నాలుగు రోజులు టీకా బంద్‌ 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని గురువారం నుంచి నాలుగు రోజులపాటు నిలిపేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి తెలిపారు. 18నుంచి యథావిధిగా టీకా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కొవిడ్‌ టీకా వేయరన్నారు. 

Follow Us on: