టీకా..అందక

ABN , First Publish Date - 2021-04-24T04:48:45+05:30 IST

వ్యాక్సిన్‌ అందక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.

టీకా..అందక
ఆకివీడు ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ ఎదురుచూస్తున్న ప్రజలు

రెండో డోస్‌ అందక సతమతం

శుక్రవారం నామమాత్రంగానే టీకా

వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉంచాలని డిమాండ్‌

ఆకివీడు/ఆచంట/ ఉండి/ పాలకోడేరు/పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 23 : వ్యాక్సిన్‌ అందక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో లేకపోవడంతో సెకండ్‌ డోస్‌ వేయించుకునేందుకు వచ్చిన  ప్రజానీకం నిరాశతో వెనుతిరుగు తున్నారు.ఆకివీడులో వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో కేవలం 30 మందికి మాత్రమే వేశారు.రెండో డోస్‌ కొరత కారణంగా ఆచంటలోనూ ఉద్యో గులకు నామమాత్రంగానే వ్యాక్సిన్‌ వేశారు.ఉండి, యండగండి పీహెచ్‌ సీలకు వ్యాక్సిన్‌కు విచ్చేసిన ప్రజలకు స్టాక్‌ లేదని చెప్పడంతో నిరాశగా వెను తిరి గారు. పాలకోడేరు పీహెచ్‌సీలో శుక్రవారం మధ్యాహ్నానికి 150 మందికి వ్యాక్సిన్‌ వేశారు.పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు పీహెచ్‌సీలో శుక్ర వారం   రెండో డోస్‌ 70 మందికి వేసినట్టు డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌కుమార్‌ తెలి పారు.వ్యాక్సిన్‌ ఎప్పుడు వేస్తున్నారో ఎప్పుడు వేయడంలేదో తెలియడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గతంలో సచివాలయాల ద్వారా కోవ్యాగ్జిన్‌ మొదటి డోస్‌ వేసిన వారికి సెకండ్‌ డోస్‌ ఎప్పుడు వేస్తారని ప్రశ్నిస్తు న్నారు.అయితే వైద్య సిబ్బంది సమాధానం చెప్పలేని పరిస్థితి ఉత్పన్న మైంది.మొదటి డోస్‌కు వచ్చిన వారు వేయడం లేదని తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుందని అయితే కేంద్రాలకు మాత్రం వ్యాక్సిన్‌కు అందడంలేదని వాపోతున్నారు.  


పరీక్షలకు పరుగులు

ఆకివీడు/ ఆచంట/పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 23 : కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ఆకివీడులో పరీక్షలకు జనం క్యూ కడుతున్నారు. రోజుకు సుమారు 40 మందికి పరీక్షలు చేస్తున్నారు.పాలకొల్లు మండలం భగ్గేశఽ్వ రంలో 50 మందికి పిహెచ్‌సీ సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిం చినట్టు డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. ఆచంట మండలంలో పలు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు సమాచారం.దీంతో మండల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. కరోనా ఉధృతి దృష్ట్యా ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  గతంలో మాదిరిగా నిరంతరం ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేసినా ఫలితం వారం రోజుల తరువాత తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వెంటనే తెలిసేలా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. 


ఆలయాల్లో వివాహాలకు 30 మందికే అనుమతి

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 23 : కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో  పంచారామక్షేత్రమైన గునుపూడిలోని సోమేశ్వర స్వామి, జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వెంకటేశ్వరస్వామివారి దేవస్థానాల్లోనూ వివాహాలు చేసుకునేందుకు 30 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ఈవోలు ఆర్‌.గంగా శ్రీదేవి, అరుణ్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే నెలలో ముహుర్తాలు ఉండడంతో చాలా మంది ఆయా తేదీల్లో వివాహలు చేసుకునేందుకు ఆలయాల్లో నమోదు చేయించుకున్నారు. సోమేశ్వరస్వామి ఆల యంలో మే 12,13, 22, 24వ తేదీల్లో వివాహాలు చేసుకునేందుకు నమో దు చేయించుకున్నారు. పద్మావతి వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో 12, 13, 14, 19, 21 తేదీల్లో వివాహాలకు నమోదు చేయించుకున్నారు.  ఆయా తేదీల్లో వచ్చేవారు 30 మందికి మించి రావడానికి అనుమతి ఉం డదని సమాచారం అందిస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితిని  బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 


కరోనాను అడ్డుకుందాం..

భీమవరం క్రైం/పెనుగొండ/ మొగల్తూరు, ఏప్రిల్‌ 23 : కరోనా విజృంభిస్తోందని.. నిర్లక్ష్యంగా  ఉంటే ప్రాణాంతకమని భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.కృష్ణభగవాన్‌ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి స్వచ్ఛంద సంస్థలను సమీకరించి కరోనా అవగాహన బ్యానర్స్‌, ప్లకార్డ్స్‌, కరపత్రాలు శుక్రవారం ఆవిష్కరించారు. రంగసాయి మాట్లాడుతూ  భీమవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, లయన్స్‌ క్లబ్‌ల ద్వారా 100 బ్యానర్లు, 100 ప్లకార్డులు ప్రతి షాపు ముందు స్టిక్కర్స్‌ వేయించామని తెలిపారు.అత్యవసరమైతేనే బయటకు రావాలని మొగ ల్తూరు ఎస్‌ఐ ఎస్‌.ప్రియకుమార్‌ సూచించారు. కరోనా ఉధృతంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని పెనుగొండ తహసీల్దార్‌ రవికుమార్‌, సీఐ సునీల్‌కుమార్‌ అన్నారు. పెనుగొండ మెయిన్‌ బజార్‌లో శుక్రవారం 6 గంటలకు షాపులను మూయించి వేశారు.


టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి : సీతారామలక్ష్మి

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌  ఉధృతంగా ఉన్నందున పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయడం లేదా వాయిదా వేయాలని నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు.పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు రద్దు చేస్తుంటే  వైసీపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతుందన్నారు.టీడీపీ టౌన్‌ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పది,ఇంటర్‌ విద్యార్థులు సుమారు 15 లక్షల మంది పరీక్షలు రాయాల్సి ఉందన్నారు.  


కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు : ఎమ్మెల్యే రామరాజు 

కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా తీవ్రంగా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉండి ఎమ్మెల్యే రామరాజు అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు కరోనాబారిన పడుతున్నారన్నారు. యువత కూడా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు   అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఇంటి వద్ద ఆవిరి పట్టడం, వేడి నీళ్లు తాగడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు.     సీ, డీ విటమిన్లు అధికంగా ఉండే జామ, ద్రాక్ష, బొప్పాయి వంటి పండ్లు, డ్రైప్రూట్స్‌ వంటివి తీసుకోవాలని తెలిపారు. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బలరాం

ప్రజలంతా కరోనా జాగ్రత్తలు పాటించాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసి స్టెంట్ల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి సచివాలయం వద్దే వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారం భించాలన్నారు. వలంటీర్లకు బాధ్యత అప్పగించాలన్నారు. 


నరసాపురంలో 7 గంటల వరకే దుకాణాలు

 నరసాపురం/ రూరల్‌, ఏప్రిల్‌ 23 : నరసాపురంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకే దుకాణాలు తెరిచే విధంగా నిర్ణయం తీసుకుంది.  ఈ  మేరకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకే షాపులు మూసివేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం బ్లీచింగ్‌, సున్నం చల్లారు. వార్డుల్లోని వీధులు, మురికివాడలను శుభ్రం చేసి శానిటేషన్‌ను మెరుగుపరుస్తున్నట్టు ఈవోపీఆర్డీ ఆంజనేయశర్మ తెలిపారు.


పాలకొల్లు వారపు సంత వాయిదా

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 23 : పాలకొల్లులో ప్రతీ శనివారం జరిగే వారపు సంత మార్కెట్‌ను కరోనా సెకండ్‌ వేవ్‌ను పురస్కరించుకుని వాయిదా వేసినట్టు వ్యాపారులు శుక్రవారం చెప్పారు. ఈ మేరకు ఛాంబర్స్‌, పట్టణ పోలీసులకు సమాచారం అందించినట్టు వ్యాపారులు తెలిపారు. ప్రజలు గమనించాలని సూచించారు. తిరిగి వారపు సంత ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. 

Updated Date - 2021-04-24T04:48:45+05:30 IST