కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పువ్వాడ నాగేశ్వరరావు
మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు
వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి అజయ్ తల్లిదండ్రులు
ఖమ్మం సంక్షేమవిభాగం,మార్చి 5: కరోనా నుంచి రక్షణ పొందేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను ధనిక, పేద తేడా లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు. ఖమ్మం మమత జనరల్ ఆసుపత్రి ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మమత జనరల్ ఆసుపత్రిలో ఆయన తన సతీమణి విజయలక్ష్మితో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురికాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టీకా తీసుకోవాలని పువ్వాడ కోరారు. పువ్వాడ నాగేశ్వరరావు వెంట మమత ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ బాగం కిషన్‌రావు, తదితరులున్నారు.