కరోనా.. కాసుల పంట!

ABN , First Publish Date - 2020-09-13T09:21:26+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగు తునే ఉంది. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతుండ డంతో ప్రజల్లో ఆందోళన ..

కరోనా.. కాసుల పంట!

జిల్లాలో 8 వేలకు చేరువలో కరోనా కేసులు

రోజురోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతున్న వైనం

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే ఎక్కువగా మరణిస్తున్నారని సమాచారం

ఇక కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుంటే కాసులకే ప్రాధాన్యతనిస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు

సౌకర్యాలు, అర్హులైన వైద్యులు లేకున్నా కొవిడ్‌ చికిత్స

అవసరం లేకున్నా చెస్ట్‌ స్కానింగ్‌లు చేయిస్తూ దోపిడీ పర్వం

సీజనల్‌ వ్యాధులని తెలిసినా కమీషన్ల కోసం పరీక్షలకు రెఫర్‌

అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తి చూడని వైద్యఆరోగ్యశాఖ అధికారులు


కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 12: జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగు తునే ఉంది. మరణాల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతుండ డంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలోని చాలా మండలాల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కేసుల సంఖ్య సైతం 8 వేలకు చేరువలో ఉన్నా రికవరీ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ వృద్ధు లు, దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులు ఎక్కువగా మరణిస్తు న్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారితో రోజు రోజుకూ జనం వణికిపోతుంటే కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు మాత్రం కాసుల వేటకే ప్రాధాన్యతనిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో రోగులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నా వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు నేడు సంపాదనలో దూసుకుపోతున్నాయి. కరోనాపై నెలకొన్న భయం కారణంగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఎంత ఫీజు అయినా చెల్లింస్తుడడంతో ప్రభుత్వ ఉత్తర్వు లు కాగితాలకే పరిమితం అయ్యాయి.


పైగా వసూలు చేస్తున్న ఫీజులకు ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా ఆయా యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి. కొన్ని ఆసుపత్రు లు కేవలం ఐదు, ఆరు రోజుల చికిత్సకే రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తుంటే మరి కొందరు హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు రిఫర్‌ చేసి కమీషన్‌ రూపంలో లక్షలు దండు కుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా మరికొ న్ని ఆసుపత్రి యాజమాన్యాలు అరువుకు తీసుకువచ్చిన వైద్యులతో ఓపీలు నిర్వహిస్తూ సీజనల్‌ వ్యాధులని తెలి సినా కమీషన్ల కోసం పరీక్షలకు రిఫర్‌ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. చిన్నపాటి జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే అన్ని పరీక్షలు రాస్తున్నారు. ఒకవేళ జలు బు, దగ్గు లాంటివి ఉంటే ముందుగా ఎక్స్‌రే లాంటివి చేయించకుండా నేరుగా చెస్ట్‌ స్కాన్‌ చేయించుకోవాలం టూ రిఫర్‌ చేస్తున్నారు.


అక్కడికి వెళితే గతంలో రూ.2 వేలు తీసుకునే నిర్వాహ కులు దొరికిందే తడవుగా రూ.5 వేల వరకు వసూలు చేస్తూ అందులోంచి రిఫర్‌ చేసిన వైద్యులకు కమీషన్‌ రూపంలో అందిస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను అప్పుల ఊబిలోకి తోస్తున్నారు. జిల్లాలో పలు ఆసుపత్రులలో సౌకర్యాలు, అర్హతలేని వైద్యులు చికిత్స అందిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్న విషయం తెలిసినా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శ లు వ్యక్తం అవుతున్నాయి.


సగం రోజులే చికిత్స అందించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సలహా

ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితు డిని చేర్చుకొని చికిత్స అందించి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్‌ చేయడానికి కనీసం రెండు వారాల సమయం తీసుకుంటుండగా ప్రైవే ట్‌ ఆసుపత్రుల్లో మాత్రం ఐదు, ఆరు రోజు లు మాత్రమే చికిత్స అందించి డిశ్చార్జ్‌ చేసి హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకోవాల ంటూ సలహాలు ఇస్తూ బిల్లులను మాత్రం పూర్తిస్థాయిలో వసూలు చేస్తున్నారనే విమ ర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం కాసుల కోసమే చికిత్సలు తప్ప రోగి ఆరోగ్యపరిస్థితి ఎటుపోతే తమకేంటీ అనే ధోరణి ప్రదర్శిస్తూ ముందుగా వచ్చిన వారిని డిశ్చార్జి చేస్తే మరికొంద రు బాధితులను చేర్చుకుని ఫీజులు వసూలు చేసుకోవచ్చన్న ఆలోచన చే స్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కరో నా చికిత్సలు అందించేందు కు ఒక పలమానాలజిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్‌ సేవలు అత్యంత కీలకం.


కానీ ఇప్పుడు వారేమి అవసరం లేదు. ఒక జనరల్‌ ఫిజీషియన్‌ గంట సేపు కన్సల్టెంట్‌గా వస్తే చాలు కరోనా చికిత్సకు సిద్ధమవు తున్నారనే ఆరోపణలు వినిపిస్తు న్నా యి. ఆసుపత్రి పెట్టడానికి అర్హత లేని వారు సైతం కమీషన్లకు ఇతరుల సర్టిఫికెట్లు పెట్టి ఆసుపత్రులను ఏర్పా టు చేస్తూ కన్సల్టెంట్‌గా వచ్చిన వైద్యునికి ఇంత అని టార్గెట్‌ పెడుతూ చికిత్స కోసం వచ్చిన వారి నాడి పట్టకుం డానే దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారు. జలుబు, దగ్గు వస్తే చాలు ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు చేయించు కొని రావాలంటూ సూచించడం పాజిటివ్‌ వస్తే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన మందులకు నయం కాదంటూ రోగులకు భయాన్నీ కలిగిస్తూ సొంత మందుల దుకాణాల్లో కొనుగో లు చేసేలా మాయలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ లాంటి పట్టణ ప్రాంతాల్లో ఈ దోపిడీ పర్వం జరుగుతున్నా అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించకపోతే ఆర్‌ఎంపీలు కూడా చికిత్సలు అం దించడం ఖాయంగా కనిపిస్తోందని పలువురు అభి ప్రాయపడుతున్నారు.


అవసరం లేకున్నా.. స్కానింగ్‌ చేస్తూ దోపిడీ

జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు కరోనా పరీక్షలకు ఎక్కువగా ప్రాధా న్యతను ఇస్తుండడంతో ఓపీ సేవలు అంతం త మాత్రంగానే అందుతున్నాయి. దీంతో ప్రజ లు సీజనల్‌ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కరో నా లక్షణాలు లేవని తెలిసినా ఆసుపత్రిలో ఓపీ తీసుకొని చికిత్స నిమిత్తం వస్తున్న ప్రతీ ఒక్కరికి ముందుగా చెస్ట్‌ స్కాన్‌ చేయించుకొ ని రావాలని తమకు అనుకూలంగా ఉన్న, కమీషన్లు ఎక్కువగా ఇచ్చే స్కానింగ్‌ సెంటర్ల కు వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు. దీంతో అవస రం లేకున్నా స్కానింగ్‌ చేస్తూ ప్రజల నుంచి వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. కరోనా వేళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటున్న విషయ ం తెలిసినా తమకు మాత్రం కాసులే కావాలని ఇతరుల ఆరోగ్యం ఎటుపోతే తమకేంటి అనే ధోరణి ప్రదర్శిస్తుండడం తమ వద్ద సరిపడా డబ్బులేకున్నా అప్పు లు చేసి మరీ నిర్వాహకులకు చెల్లిస్తు న్నారు.


ఈ దోపిడీ పర్వం జిల్లా కేంద్రం లోనే అత్యధికంగా జరుగుతు న్నా పలు సందర్భాల్లో తనిఖీలకు వెళ్లిన ప్పుడు ఎంతో కొంత ముట్టజె బుతున్నారుగా తమకేందుకులే అనే నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తున్నా రనే వాదనలు సొంతశాఖలోని సిబ్బంది నుంచి వెలువడుతు న్నాయంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కరోనా లక్షణాలు ఉంటే నిపుణులైన వైద్యులు ఎక్స్‌రేకు ముందుగా ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందులో ఏదైన అనుమానిత లక్షణాలు ఉంటేనే స్కానింగ్‌కు రిఫర్‌ చేస్తూ తీవ్రత ఉంటే హైదరాబాద్‌, నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లాలని సూచించడ మో లేదంటే హోం క్వారంటైన్‌లో ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తూ పలు మందులను వాడాలని సూచిస్తున్నారు.


వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అధిక ప్రభావం చూపిస్తున్న వైరస్‌

జిల్లాలో ఇప్పటి వరకు 54 మంది కరోనా భారిన పడి మరణించారని సమాచారం. ఇందులో అత్యధికులు వృద్ధు లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే ఉన్నారని తెలుస్తోంది. చిన్న పిల్లలు, యువకులు, మధ్య వయసుకు చెందిన వారు కరో నా వైరస్‌ భారిన పడిన వైద్యుల సలహాలు, సూచన లతో అవసరమైతే ఆసుపత్రిలో లేదంటే హోంక్వారం టైన్‌లో ఉంటూ చికిత్సలు పొంది కరోనా బారీ నుంచి బయటపడు తున్నప్పటికీ వయస్సు పైబడిన వారు షుగర్‌, బీపీ, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలికంగా చికిత్సలు పొం దుతున్న, మందులు వాడుతున్న వారు ఎక్కువగా మరణి స్తున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం లాం టివి చేయకుండా ఉండడంతో పాటు, వైరస్‌ సోకిన వారికి దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైన చిన్నపాటి ఇబ్బంది కలిగినా సొంత వైద్యానికి ప్రాధాన్యత నిస్తూ చేతులు దాటిపోయాక చికిత్సకు వచ్చే కంటే నిపుణులైన వైద్యుల వద్ద చికిత్స చేయించు  కోవాలి.

Updated Date - 2020-09-13T09:21:26+05:30 IST