దినదిన గండంగా బతుకీడుస్తున్న వడ్రంగి కార్మికులు

ABN , First Publish Date - 2020-07-14T17:54:57+05:30 IST

వడ్రంగి కార్మికులు సరైన ఉపాధి లేక దినదిన గండంగా బతుకీడుస్తున్నారు.

దినదిన గండంగా బతుకీడుస్తున్న వడ్రంగి కార్మికులు

విజయవాడ: వడ్రంగి కార్మికులు సరైన ఉపాధి లేక దినదిన గండంగా బతుకీడుస్తున్నారు. వారి బాధను పట్టించుకునే నాధుడేలేక అల్లాడిపోతున్నారు. వ్యాపారాలు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో తరతరాలుగా వడ్రంగి పనిచేసుకుంటూ బతుకీడుస్తున్న కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..


కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. రోజుల తరబడి పనులు లేకపోవడంతో వివిధ వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో పేద, చేతివృత్తులవారి జీవనాధారం భారంగా మారింది. ప్రధానంగా వడ్రంగి కార్మికుల కష్టాలు అయితే మాటల్లో చెప్పలేనివిగా మారాయి. సడలింపులు రావడంతో ఇక వ్యాపారం చేసుకుందామనుకునేవారికి వర్షాకాలం శాపంగా మారింది. కొనుగోలు చేసి భద్రపరుచుకున్న చెక్కలు వర్షానికి తడిసి చెదలు పట్టడంతో ఆర్థికంగా ఆందోళన చెందుతున్నారు. కరోనా తమ జీవితాలను తలకిందులు చేసిందని వాపోతున్నారు. పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని వడ్రంగి కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2020-07-14T17:54:57+05:30 IST