క్యారెట్‌ బీన్స్‌ తోరణ్‌

ABN , First Publish Date - 2020-02-02T01:43:22+05:30 IST

ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, కొబ్బరి తురుము - అర కప్పు, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, క్యారెట్లు - మూడు, నూనె - సరిపడా, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు -

క్యారెట్‌ బీన్స్‌ తోరణ్‌

కావలసినవి: ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, కొబ్బరి తురుము - అర కప్పు, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, క్యారెట్లు - మూడు, నూనె - సరిపడా, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, కరివేపాకు - ఒక కట్ట, పసుపు - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

 

తయారీ: బీన్స్‌, క్యారెట్‌లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని కుక్కర్‌లో వేసి చిటికెడు ఉప్పు వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరిని తీసేసి బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, జీలకర్రను మిక్సీలో వేసి మసాల సిద్ధం చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పసుపు, మసాల పొడి వేయాలి. కాసేపు వేగిన తరువాత ఉడికించి పెట్టుకన్న బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి మరికాసేపు ఉడికిస్తే క్యారెట్‌ బీన్స్‌ తోరణ్‌ రెడీ.

Updated Date - 2020-02-02T01:43:22+05:30 IST