క్యారెట్‌ పొరియల్‌

ABN , First Publish Date - 2021-11-06T18:33:39+05:30 IST

తమిళనాడు వంటకం చేయడం ఎంతో తేలిక. దీన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. సాంబార్‌, రసాలతో కలిపి సైడ్‌ డిష్‌గా అన్నంతో ఆస్వాదించవచ్చు.

క్యారెట్‌ పొరియల్‌

తమిళనాడు వంటకం చేయడం ఎంతో తేలిక. దీన్ని చపాతీలతో కలిపి తినవచ్చు. సాంబార్‌, రసాలతో కలిపి సైడ్‌ డిష్‌గా అన్నంతో ఆస్వాదించవచ్చు. 


కావలసిన పదార్థాలు: తాలింపు గింజలు: ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు: రెండు రెమ్మలు, పచ్చిమిర్చి: 2 (నిలువుగా కట్‌ చేసుకోవాలి), క్యారెట్‌ ముక్కలు: రెండు కప్పులు (కడిగి, తొక్కుతీసి, ముక్కలు తరగాలి), పసుపు, ఉప్పు, ఇంగువ: సరిపడా, నువ్వుల నూనె: రెండు టీస్పూన్లు, పచ్చి కొబ్బరి తరుగు: 2 టేబుల్‌ స్పూన్లు


తయారీ విధానం: బాండీలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పుప్పు వేయించాలి. తర్వాత కరివేపాకు వేసి, చిటపటలాడాక, పచ్చిమిర్చి, క్యారెట్‌ ముక్కలు వేయాలి. పసుపు, ఉప్పు, ఇంగువ వేసి కలిపి, అర కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు ఇంకేవరకూ చిన్న మంట మీద ఉడికించాలి. కొబ్బరి తురుము వేసి, కలపాలి. మూత తీసి ఉంచి, నీరంతా ఇగిరిపోయి, కూర పొడిగా మారే వరకూ చిన్న మంట మీద ఉడికించాలి. తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించాలి.



Updated Date - 2021-11-06T18:33:39+05:30 IST