క్యారెట్‌ సూప్‌

ABN , First Publish Date - 2020-08-01T19:07:16+05:30 IST

స్టాక్‌ కోసం : క్యారెట్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంపలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.

క్యారెట్‌ సూప్‌

కావలసినవి: స్టాక్‌ కోసం : క్యారెట్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంపలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.


గార్నిష్‌ కోసం : ఉల్లిపాయ - ఒకటి, పాలకూర - ఒక కట్ట, పాలు - పావు కప్పు, నూనె - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత.


తయారీ: క్యారెట్లు శుభ్రంగా కడిగి తురుమాలి. ఉల్లిపాయ కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపలు పొట్టుతీసి చిన్నగా కట్‌ చేయాలి. ఇప్పుడు కుక్కర్‌లో ఐదు కప్పుల నీళ్లు పోసి క్యారెట్లు, ఉల్లిపాయ, బంగాళదుంపలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత వాటిని బయటకు తీసి మిక్సీలో వేసి పట్టుకోవాలి. మరొక పాత్రను స్టవ్‌పై పెట్టాలి. కాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పాలకూర వేసి వేగించాలి. ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న స్టాక్‌ వేసి కొద్దిసేపు ఉడికించాలి. తరువాత పాలు వేడి చేసి పోయాలి. బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి చల్లి వేడిగా అందించాలి.

Updated Date - 2020-08-01T19:07:16+05:30 IST