క్యారెట్ టొమాటో సూప్
ABN , First Publish Date - 2021-07-07T18:23:37+05:30 IST
క్యారెట్- రెండు, టొమాటోలు- రెండు, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, మిరియాలు, జీలకర్ర పొడి- సగం స్పూను, ఉప్పు- తగినంత, ఆలివ్ నూనె- స్పూను.
కావలసిన పదార్థాలు: క్యారెట్- రెండు, టొమాటోలు- రెండు, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, మిరియాలు, జీలకర్ర పొడి- సగం స్పూను, ఉప్పు- తగినంత, ఆలివ్ నూనె- స్పూను.
తయారుచేసే విధానం: కూరగాయల చెక్కుతీసి, ముక్కలుగా కోయాలి. ప్రెజర్ కుక్కర్లో కూరగాయల ముక్కలు, వెల్లుల్లి, నీళ్లు వేసి మూడు విజిల్స్ వరకు ఉడికించి గ్రైండర్లో ప్యూరీగా చేసిపెట్టుకోవాలి. ఓ పాన్లో ఆలివ్ నూనెవేసి మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వ్యూరీని కలిపి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ బాగా చిక్కపడితే కాస్త నీళ్లు వేసి మరిగించాలి. పైన పనీరు లేదా వెన్న తుమురును వేసి సర్వ్చేయవచ్చు.