ముమ్మిడివరం, జనవరి 23: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కేవీ నాగార్జున తెలిపారు. అయినాపురానికి చెందిన గొల్లపల్లి కుమారికి దుర్గారావుతో 16ఏళ్ల క్రిందట వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు. అదనపు కట్నం తీసుకురమ్మని భర్త వేధింపులకు గురిచేస్తూ ఈనెల12న ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.