The Kapil Sharma show స్టార్‌పై అమెరికాలో కేసు.. కారణం ఏంటంటే..

Published: Sun, 03 Jul 2022 12:42:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
The Kapil Sharma show స్టార్‌పై అమెరికాలో కేసు.. కారణం ఏంటంటే..

ది కపిల్ శర్మ షో.. ఈ టాక్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో యాంకర్ కపిల్ శర్మ (Kapil Sharma) కామెడీ టైమింగ్‌కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షోతో వచ్చిన పాపులారిటీతో ఈ కమెడియన్ పలు చిత్రాల్లో కూడా నటించాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ స్టాండప్ కామెడీ షో కూడా చేశాడు. కపిల్ ప్రస్తుతం అమెరికా(America) పర్యటనలో ఉన్నాడు. తాజాగా కపిల్‌పై అమెరికాలో ఓ కేసు నమోదైంది.


కపిల్ 2015లో నార్త్ అమెరికా టూర్ చేశాడు. అందులో భాగంగా.. సాయి యూఎస్‌ఏ ఇంక్ అనే ఓ సంస్థ తరుఫున ఆరు నగరాల్లో ఆరు ప్రదర్శనలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అయితే.. అగ్రిమెంట్ ప్రకారం కాకుండా కేవలం ఐదు ప్రదర్శనలు మాత్రమే ఇచ్చాడని ఆ సంస్థ తాజాగా కపిల్ అమెరికాలోని ఓ కేసు ఫైల్ చేసింది. అందులో.. ‘కపిల్ ఆరు ప్రదర్శనలు ఇస్తానని ఒప్పందం చేసుకుని, దానికి అమౌంట్ కూడా ముందేతీసుకున్నాడు. కానీ.. ఐదు మాత్రమే ఇచ్చాడు. దాని విషయమై చాలాసార్లు ఆయన్ని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ.. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు’ అని పేర్కొన్నారు. ఈ కేసు ఇంకా న్యూయార్క్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.


ఈ విషయాన్ని తెలుపుతూ సాయి యూఎస్‌ఏ ఇంక్ సంస్థ ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ సైతం పెట్టింది. అందులో.. ‘2015లోని మా కాంట్రాక్ట్‌ని బ్రేక్ చేసినందుకు కపిల్ శర్మ మీద సాయి యూఎస్‌ఏ ఇంక్ ఓ లాసూట్ వేసింది’ అని రాసుకొచ్చింది. తాజాగా కపిల్ శర్మ చేస్తున్న పర్యటనలో ఆయన కో కమెడియన్స్ శారదా, సుమోనా చక్రవర్తి, కృష్ణ అభిషేక్, చందన్ ప్రభాకర్‌ కూడా ఉన్నారు. కపిల్ జూన్ 25, శనివారం వాంకోవర్‌లో మొదటి ప్రదర్శనను నిర్వహించగా.. అందులో దివంగత గాయకులు సిద్ధూ మూస్ వాలా, కేకే, కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్ సంధు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు నివాళులు అర్పించాడు. ఈ వీడియోని కపిల్ శర్మ షో అధికారిక హ్యాండిల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘లెజెండ్స్ లైవ్ ఫరెవర్’ అనే క్యాప్షన్‌తో వీడియోను అప్‌లోడ్ చేయగా.. అది వైరల్‌గా మారింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...