సర్పవరం జంక్షన్, మార్చి 27: కుటుంబ కలహాల నేపథ్యంలో సోదరిపై అక్క, బావ దాడి చేసిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్హెచ్వో ఆకుల మురళీకృష్ణ తెలిపారు. రమణయ్యపేట ఇందిరా కాలనీకి చెందిన వి.భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావు భార్యాభర్తలు. కుటుంబ కలహాలు, పాత గొడవల నేపథ్యంలో ఆదివారం తగవు పెట్టుకుని కుంచాడ పద్మావతి, భర్త శ్రీనివాసులు బూతులు తిట్టి, రాయితో తలపై దాడికి పాల్పడ్డారంటూ భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్ కానిస్టేబుల్ బి.అనిల్ కేసు నమోదు చేశారు.