టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా..

Published: Sun, 23 Jan 2022 18:29:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా.. ప్రతీకాత్మక చిత్రం

టాయిలెట్ వల్ల సమస్య తలెత్తడమేంటీ.. అది కూడా కోర్టు వరకు వెళ్లడమేంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? కొన్నిసార్లు ఇలాగే ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను కొందరు పెద్దవి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఆ కోవకే చెందుతుంది. టాయిలెట్‌ ఫ్లషింగ్ శబ్ధాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని, దీంతో తమకు నిద్రాభంగం కలుగుతోందని పక్కింటి వారిపై కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల పాటూ సాగిన ఆ టాయిలెట్ ఫ్లషింగ్ కేసు అసలు విషయంలోకి వెళితే..

ఇటలీలో 19సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగింది. గల్ఫ్ ఆఫ్ పోయెట్స్‌లో రెండు కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. అంతవరకూ ఏ సమస్య లేకున్నా.. మరుగుదొడ్డి వల్ల వారి మధ్య వివాదం మొదలైంది. ఒకరి ఇంట్లోని టాయిలెట్ గోడకు అవతల.. పక్కింటి వారి టాయిలెట్ ఉండడమే సమస్యకు కారణమైంది. టాయిలెట్‌ ప్లషింగ్ ట్యాంక్‌ను ఉపయోగించిన సమయంలో వచ్చే శబ్ధాలు.. గోడ అవతల పక్కింటి బెడ్‌రూంలో ఉన్న వారికి ఇబ్బంది కలిగించేవి. దీంతో రెండు కుటుంబాల మధ్య ఈ విషయమై గొడవలు జరిగేవి. చివరకు బాధితులు 2003లో కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసుపై ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. బాధితులకు నష్టపరిహారం కింద సుమారు 10,000 యూరోలు(సుమారు రూ.8లక్షలు) నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త ఆ దేశంలో సంచలనం కలిగిస్తోంది.

ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

వేగంగా వెళ్తున్న రెండు ట్రైన్ల మధ్య.. అంతే వేగంగా పరుగెడుతున్న గుర్రం.. సినిమా కాదు.. రియల్..videoఒంటరిగా వెళ్తున్న బాటసారులే ఆ ట్రాన్స్‌జెండర్ల టార్గెట్.. ఓ వ్యక్తిని అడవిలోకి లాక్కెళ్లి... ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.