సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

Published: Sat, 11 Sep 2021 00:33:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు

హైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International