కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-06T10:23:35+05:30 IST

ప్రభుత్వ పథకాలను అడ్డుకు న్నందుకు అధికారులను, ఎమ్మెల్సీని ఇబ్బందులకు గురి చేసినందుకు 35 మందిపై కేసు నమోదు చేసినట్లు

కేసు నమోదు

పోరుమామిళ్ల, జూలై 5 : ప్రభుత్వ పథకాలను అడ్డుకు న్నందుకు అధికారులను, ఎమ్మెల్సీని ఇబ్బందులకు గురి చేసినందుకు 35 మందిపై కేసు నమోదు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ విజయకుమార్‌ తెలిపారు. ఆదివారం పోలీసుస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 3న నరసాపురంలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారు అడ్డుకున్నారన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై ఇప్పటికి 13 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.


‘కారును అడ్డుకున్నది మేమే.. అరెస్టు చేయండి’

కాశినాయన: ఎమ్మెల్సీ కారును అడ్డుకున్నది మ హిళలైతే పురుషులపై కేసులు ఎలాపెడతారని నర్సాపు రానికి చెందిన మహిళలు ఆదివారం అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసులను ప్రశ్నించారు. కారును అడ్డుకున్నది తామేనని, తమనే అరెస్ట్‌ చేయాలని పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవడం విశేషం.

Updated Date - 2020-07-06T10:23:35+05:30 IST