ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

ABN , First Publish Date - 2021-12-04T05:20:29+05:30 IST

మంత్రాలయం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడికి యత్నించాడు.

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

మంత్రాలయం, డిసెంబరు 3: మంత్రాలయం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. గురువారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ముగించుకొని సమీపంలో ఉన్న తమ గుడిసెలోకి నీళ్లు తాగేందుకు బాలిక వెళ్లింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు గుడిసెలోకి వెళ్లి  అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. బాలిక తప్పించుకొని బయటకు వచ్చి కేకలు వేయడంతో యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు గురువారం రాత్రి మంత్రాలయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపారు.

Updated Date - 2021-12-04T05:20:29+05:30 IST