గిరిజన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

ABN , First Publish Date - 2022-06-30T20:02:20+05:30 IST

కార్పొరేట్‌ చదువులను తలదన్నేలా గిరిజన గురుకులాల్లో విద్య అందుతోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో గిరిజన గురుకుల

గిరిజన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్‌


హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ చదువులను తలదన్నేలా గిరిజన గురుకులాల్లో విద్య అందుతోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో గిరిజన గురుకుల విద్యార్ధులు, ఏకలవ్య రెసిడెన్షియల్‌ విద్యార్థులు సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటిన గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులను... సంక్షేమ భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సత్యవతి  రాథోడ్‌ అభినందించారు. వివిధ గ్రూపుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులకు రూ.25వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్ధులకు రూ.15వేలు నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి అందజేశారు. విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అలాగే... ఇంటర్‌ ఫలితాల్లో మైనార్టీ గురుకుల విద్యార్ధులు ప్రతిభ కనబరిచారని మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి షఫీవుల్లా తెలిపారు. 19 గురుకులాలు 100% ఉత్తీర్ణత సాధించాయన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ అభినందించారని కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-06-30T20:02:20+05:30 IST