మట్టి ఖర్చులకూ డబ్బు రావటం లేదు

ABN , First Publish Date - 2022-10-01T04:32:01+05:30 IST

ఉద్యోగి మరణిస్తే ఈ ప్రభుత్వం నుంచి కనీసం మట్టి ఖర్చులకు కూడా సరైన సమయంలో డబ్బులు రావటం లేదని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు.

మట్టి ఖర్చులకూ డబ్బు రావటం లేదు
చెక్కులను అందజేస్తున్న ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు బండి

నెల్లూరు(హరనాథఫురం), సెప్టెంబరు 30 : ఉద్యోగి  మరణిస్తే ఈ ప్రభుత్వం నుంచి కనీసం మట్టి ఖర్చులకు కూడా సరైన సమయంలో డబ్బులు రావటం లేదని ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు విమర్శించారు. నెల్లూరులోని ఎన్జీవో హోంలో జిల్లా ఎన్జీవో సంఘం, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన సొసైటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకొన్న జీపీఎఫ్‌ , ఏపీజీఎల్‌ డబ్బులు నెలలు, ఏళ్లు గడుస్తున్నా రావటం లేదన్నారు.  ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు సీపీఎస్‌ ఉద్యోగులను పాత పెన్షన్‌ విధానంలోకి తీసుకురావాలన్నారు. ఒప్పంద ఉద్యోగులందరినీ కాలయాపన చేయకుండా క్రమ బద్ధీకరించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాయతీలు వచ్చేలా, ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు సంబంధించి 13 ఏళ్ల క్రితం ఆగిపోయిన రూ.1.18కోట్లను ప్రభుత్వం హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఖాతాలో జమ చేసిందన్నారు. సభ్యులకు ఈ రోజు నుంచి ఇస్తున్న చెక్కులకు 6శాతం వడ్డీ ప్రభుత్వం నుంచి వచ్చేందుకు తమ వంతు కృషిచేస్తామన్నారు. ఎన్జీఓ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు మాట్లాడుతూ 2000 మంది సభ్యులకు  వారంలోగా పూర్తిమొత్తం అందజేస్తామన్నారు. కార్య క్రమంలో ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, కార్య దర్శులు  సుబ్బారెడ్డి, రంజిత్‌ నాయుడు,  జిల్లా కార్యదర్శి నాయుడు వెంకట స్వామి, అసోసియేట్‌ అధ్యక్షుడు నాగిశెట్టి గిరిధర్‌, కోశాధికారి బండారుపల్లి వెంకటేశ్వర్లు,  జిల్లా హౌస్‌ బిల్లింగ్‌ సొసైటీ అధ్యక్షుడు  ఎం.వెంకటేశ్వరరాజు, చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T04:32:01+05:30 IST