‘కాసు’పత్రులు

ABN , First Publish Date - 2022-09-26T05:42:04+05:30 IST

ప్రభుత్వ అనుమతులు ఉం డవు....అనుమతులున్నా నిబంధనలు పాటించరూ...

‘కాసు’పత్రులు

- అనుమతి లేకున్నా వైద్యం

- అర్హులైన వైద్యులు లేరు, కనీస వసతులు కరువు

- జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం

- అధికారుల తనిఖీలతో అక్రమార్కుల్లో దడ

- ఇప్పటికే 22 ఆసుపత్రులకు నోటీసులు

జగిత్యాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అనుమతులు ఉం డవు....అనుమతులున్నా నిబంధనలు పాటించరూ...అర్హులైన వైద్యులు ఉం డరు...కనీస వైద్య సౌకర్యాలు కనిపించవు...అయినప్పటికీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఎలాంటి రోగానికైనా చికిత్స చేస్తామంటూ ముందుకు వస్తుండడం విమర్శలకు గురిచేస్తోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ వంటి పట్టణాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజ మాన్యాలు గుట్టు చప్పుడు కాకుండా చికిత్సను నిర్వహిస్తున్నాయన్న ఆరో పణలున్నాయి. పలువురు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా చికిత్సలు చేస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. మరికొన్ని ఆసుపత్రులు అనుమతులు పొందినా రికార్డులు నిర్వ హించకుండా, నిబంధనలు పాటించడం లేదు. సిటీస్కాన్‌, ల్యాబ్‌ పరీక్ష లు, ఎక్స్‌రే తదితర పరీక్షల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరో పణలున్నాయి. అనుమతులు లేని, నిబంధనలు పాటించని పలు ప్రైవే టు ఆస్పత్రులపై రెండు, మూడు రోజులుగా ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ బృందాలు సోదాలు నిర్వహించడం సంబంధిత వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

పుట్టగొడుగుల్లా ...

జిల్లాలోని ప్రధాన పట్టణాలతో మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీ లు తదితర ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆసుపత్రులు వెలుస్తు న్నాయి. జిల్లాలో సుమారు 300కు పైగా ప్రైవేటు ఆసుపత్రులున్నట్లు అం చనా ఉంది. అదేవిధంగా పదుల సంఖ్యలో హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, ఫిజియోథెరపీ ప్రైవేటు ఆసుపత్రులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు సుమారు రెండు వందల వరకు ల్యాబ్‌లు, స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇంకొందరు ప్రైవేటు ఆసుపత్రులను నిర్వహిస్తు న్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా వందల సంఖ్యలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు సైతం నర్సింగ్‌ హోంలకు దీటుగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు.

విస్తృతంగా తనిఖీలు..అక్రమార్కులకు నోటీసులు..

జిల్లాలోని పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో గల ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుప్పాల శ్రీధర్‌ నేతృ త్వంలో తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లాలో రెండు రోజులుగా అధికారు లు 36 ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలు చేశారు. నిబంధనలు పాటించని 22 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఒక ఆసుపత్రి అనుమతిని రద్దు చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సిఫారుసు చే శారు. ఈనెల 23వ తేదీన 13 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి 9 ఆసు పత్రులకు నోటీసులు జారీ చేశారు. 24వ తేదిన 23 ఆసుపత్రుల్లో తనిఖీ లు నిర్వహించి 13 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. 

 వెలుగులోకొస్తున్న అక్రమాలు..

అధికారులు చేస్తున్న తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వస్తు న్నాయి. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు అధికారులు గుర్తించారు. ఒక వైద్యుని పేరు మీద రిజిస్ట్రేషన్‌ కలిగి యుండి మరొకర వైద్యుడు ఆసుపత్రిని నిర్వహించడం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన సౌకర్యాలు ఉండక పోవడం, తక్కువ బెడ్లకు అనుమతిని పొంది ఎక్కువ బెడ్లను ఏర్పాటు చేయడం, అర్హత లేకపోయిన ఎండీ, సర్జన్‌, ఇతర ప్ర త్యేక వైద్యుల పేర్లు పెట్టుకోవడం, ఆపరేషన్‌ థియేటర్లు, ఇతర అవసర మైన పరికరాలు లేకపోవడం వంటివి వెలుగుచూస్తున్నాయి. బయో మెడి కల్‌ వేస్టేజ్‌ నిబంధనలు పాటించకపోవడం, అగ్నిమాపక శాఖ అనుమ తులు లేకపోవడం, సరిపోయే సంఖ్యలో నర్సింగ్‌ స్టాఫ్‌ను నియమించక పోవడం వంటి పరిస్థితులను ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అర్హతలేని ల్యాబ్‌ టెక్నిషియన్లు పనిచేయడం, ధరల పట్టికల ను ప్రదర్శించకపోవడం, ఆసుపత్రుల్లో కేస్‌ షీట్లు, రికార్డులు నిర్వహిం చాల్సి ఉన్నప్పటికీ చాలా చోట్ల అమలు చేయడం లేదని అధికారులు గుర్తించారు.

కాసుల కోసం అబార్షన్ల దందా...

సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా పరిగణిస్తారు...కొందరు వైద్యులు మాత్రం వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారీతికి పాల్పడుతున్నారు. కాసుల కు కక్కుర్తి పడి గర్బస్థ శిశువుల కన్నుమూతకు కారకులవుతున్నారు. గు ట్టు చప్పుడు కాకుండా అబార్షన్లను చేస్తూ కాసులు మూట గట్టుకుంటు న్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని పలు ఆసుపత్రుల నిర్వాహకులు గుట్టు చప్పుడుకాకుండా అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. జగిత్యాల, మెట్‌పల్లి వంటి ప్రాంతాల్లో పలు ఆసుపత్రులు అబార్షన్లకే ప్రత్యేక గుర్తింపును సాధించాయన్న ప్రచారం ఉంది. 

లొసుగులను ఆసరగా చేసుకొని....

అబార్షన్‌ ఏ పరిస్థితిలో చేయడానికి పలు నిబంధనలున్నాయి. ఇందు లోని లొసుగులను ఆసరగా చేసుకొని పలువురు ఇష్టారీతిగా వ్యవ హరి స్తున్నారు. గర్భంలో శిశువు బుద్ది మాంద్యం, తక్కువ బరువు, వివిధ రకా ల రుగ్మతలతో ఉన్నప్పుడు తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబా ర్షన్‌ చేసేందుకు అనుమతి ఉంది. స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే అబార్షన్‌ చేయాల్సి ఉంటోంది. అబార్షన్లు చేయడానికి సదరు ఆసుపత్రికి లీగల్‌ రిజి స్ట్రేషన్‌ కలిగి ఉండాలి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణపై దృష్టి సారించడం, విస్తృతంగా తనిఖీలు నిర్వ హిస్తుండడం, నోటీసులు జారీ చేయడం, అవసరమైన పక్షంలో అనుమతి రద్దుకు సైతం సిఫారుసు చేస్తుండడంతో అక్రమార్కుల్లో దడ పుడుతోంది. 

నిబంధనలు పాటించాలి

- పుప్పాల శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాటిం చాలి. ఆసుపత్రుల్లో అనుమతిలేకుండా వైద్య చేస్తుండడం, అధిక ఫీజుల వసూళ్లు, సౌకర్యాల కొరత, అర్హత లేని సిబ్బందిని వినియోగించడం వం టి వాటిపై పకడ్బందిగా దృష్టి సారిస్తాం. అవసరమైన సమయాల్లో విస్తృ తంగా తనిఖీలను చేపడుతాము. నిబంధనలు పాటించని వారిపై చట్టప్ర కారం చర్యలు తీసుకుంటాము.

Updated Date - 2022-09-26T05:42:04+05:30 IST