జీడి, టేకు చెట్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-03-01T05:11:02+05:30 IST

అంబాడ వెంకటాపురంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోటలో జీడిమామిడి, టేకు చెట్లు దగ్ధమయ్యాయి.

జీడి, టేకు చెట్లు దగ్ధం

రేగిడి, ఫిబ్రవరి 28: అంబాడ వెంకటాపురంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోటలో జీడిమామిడి, టేకు చెట్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అంచనావేశారు. గ్రామానికి చెందిన ముంజు అప్పలరాజు, ముంజు కృష్ణ, ముంజు అసిరినాయుడు, నెయిగోపల సత్యం, నెయిగోపల సంగంనాయుడుకు చెందిన జీడిమామిడి, టేకు తోటలు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పక్కనే ఉన్న వరి దుబ్బుల్లో ఎవరైనా పొగ కాల్చి పారవేయటంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో 21 జీడి మామిడి మొక్కలు కాలిపోగా, టేకు తోటకు నష్టం వాటిల్లినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు అదుపుచేశారు. 

 


Updated Date - 2021-03-01T05:11:02+05:30 IST